https://oktelugu.com/

Left Hand: ఎడమ చేతితో ఫుడ్ ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

కుడి చేయి ఎప్పుడూ కూడా శుభాన్ని సూచిస్తుంది. ఈ కుడి చేయి సూర్యుని నాడిని సూచిస్తుంది. కుడి చేతితో పనులు చేయడం వల్ల తగినంత శక్తి కలుగుతుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 21, 2024 3:03 pm
    Left Hand

    Left Hand

    Follow us on

    Left Hand: దేశంలో స్పూన్‌తో కంటే చేతితోనే ఎక్కువగా భోజనం చేస్తారు. భోజనం చేసేటప్పుడు చేతిలోని ఐదు వేళ్లు కూడా నోటిలోకి వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడంటే జనరేషన్ మారి అందరూ స్పూన్లతో తినడం అలవాటు చేసుకుంటున్నారు. కానీ పూర్వ కాలం నుంచి చేతితోనే తినడం దేశంలో సాంప్రదాయం. అయితే తినేప్పుడు ఐదు వేళ్లు కూడా శరీరంలోకి వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, జీర్ణవ్యవస్థ సమస్యలు రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. హిందూ మతంలో కుడిచేతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ పని చేసిన కూడా కుడిచేతితోనే చేస్తారు. ముఖ్యంగా భోజనం అయితే తప్పకుండా కుడి చేతితోనే చేయాలని అంటారు. ఇలా కుడి చేతితో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. ఎవరో కుడిచేతితో తినలేని వాళ్లు తింటారు. ఒకవేళ పొరపాటున తిన్నా కూడా ఎడమ చేతితో తినకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అయితే కుడి చేతితోనే ఎందుకు భోజనం చేయాలి? ఎడమ చేతితో ఎందుకు భోజనం చేయకూడదు? అనే విషయాలు పూర్తిగా తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    కుడి చేయి ఎప్పుడూ కూడా శుభాన్ని సూచిస్తుంది. ఈ కుడి చేయి సూర్యుని నాడిని సూచిస్తుంది. కుడి చేతితో పనులు చేయడం వల్ల తగినంత శక్తి కలుగుతుంది. అయితే బలమైన పనులు సూర్యనాడిని సూచించే కుడి చేతితో చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎడమ చేయి చంద్ర నాడిని తెలుపుతుంది. దీనిని శక్తి ఎక్కువగా అవసరం లేని వాటికి ఉపయోగిస్తారట. అందుకే మల విసర్జన వంటి వాటికి ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా చేసిన వాటితో మళ్లీ అదే చేతితో తినడం వల్ల అపరిశుభ్రంగా భావించడం వల్ల కుడి చేతితో తింటారు. ఎలాంటి శుభకార్యం ప్రారంభించిన కూడా కుడి చేతితో మాత్రమే ప్రారంభించాలని పండితులు అంటున్నారు. ఇలా కుడి చేతితో ప్రారంభించడం, ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీని కుడి చేయి ఇప్పిస్తుంది. అందుకే ఎడమ చేతితో కాకుండా కుడి చేతితో మాత్రమే భోజనం చేయాలని చెబుతుంటారు.

    ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయి చాలా మంది చేతులతో కాకుండా స్పూన్లతో తింటున్నారు. ఇలా స్పూన్లతో కాకుండా చేతులతో తినడం వల్ల ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తాయి. చేతులతో తిన్నప్పుడు నోటిలోకి అన్ని వేళ్లు వెళ్లడం వల్ల స్పర్శ, వాసన, దృష్టి, వినికిడి అన్ని కూడా సక్రమంగా పనిచేస్తాయి. అలాగే ఇవి మెదడుకి కూడా సంకేతాన్ని పంపుతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అలాగే మెదడుని కూడా ఉత్తేజపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలు చేతులతో అది కూడా కుడి చేతితో భోజనం చేయాలని చెబుతుంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.