Interesting: తల్లిదండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు. పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం తల్లిదండ్రులు ఆశీర్వాదాలు, వారు చేసిన మంచి అని భావిస్తారు. ఏదైనా అన్యాయం జరిగితే పూర్వ జన్మలో ఏం పాపం చేశావో నీకు ఈ జన్మలో ఇలా అయ్యిందని అంటుంటారు. కొందరు పిల్లలు కూడా తల్లిదండ్రులను బెదిరిస్తుంటారు. అసలు నన్ను ఎందుకు కన్నావు? నీ కడుపులో నేను పుట్టి తప్పు చేశానని తల్లిదండ్రులను తప్పు పడతారు. ఇలా తల్లిదండ్రులను దూషించకూడదు. గతంలో మనం చేసిన పనులు వల్లే వచ్చే జన్మలో కుటుంబం మనకి వస్తుందట. అసలు తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే అది పిల్లలకు చుట్టుకుంటుందా? వారి చేసే తప్పులకు అసలు పిల్లలు బలవుతారా? వారి చేసిన మోసాలా పాపాలు పిల్లలకు తగులుతాయా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.
ఎవరైనా గత జన్మలో కానీ, ఉన్న జన్మలో కానీ పాపాలు చేస్తే తప్పకుండా అవి తగులుతాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఏ పాపం చేసిన కూడా పిల్లలకు తగులుతుందట. గత జన్మలో మనం చేసిన కర్మల బట్టి ఈ జన్మలో మనకి కుటుంబం వస్తుందట. ఆ కుటుంబాన్ని కూడా మనమే నిర్ణయించుకుంటామట. ముఖ్యంగా ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే తప్పకుండా ఆ పాపం కుటుంబం మొత్తానికి తగులుతుందట. స్త్రీలకు మోసం చేస్తే పాపం తగలడంతో పాటు పితృదేవతలకి పాపం చేయడం, సర్పాలను చంపడం వల్ల కూడా ఆ పాపం తగులుతుందట. వీటివల్ల కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు రావట. అయితే ఇది కేవలం ఆ తరానికే కాకుండా తర్వాత తరాలకు కూడా ఈ పాపం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మన పెద్దలు అంటారేమో.. పుణ్యం చేస్తే తరతరాలు మాట్లాడుకుంటారని, వారికి మంచి జరుగుతుందని అంటుంటారు. ఇలా పాపాలు చేయడం వల్ల సంతానం కూడా కలగదని నిపుణులు అంటున్నారు. కాబట్టి పాపాలు చేసే ముందు ఒక్కసారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి.
ఇప్పుడు మీరు ఏవైనా అనుభవిస్తున్నారంటే వాటికి కారణం అవన్నీ మీ పూర్వీకులు చేసిన ఫలితమే. అయితే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరూ మద్యం సేవించడం, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటివి తప్పకుండా పిల్లలకు తగులుతాయని అంటున్నారు. వీటితో పాటు పిల్లలను చంపడం, ఆడవాళ్లను వేధించడం, భూములు లాక్కోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి కూడా చేయడం వల్ల వాటి ప్రభావం తప్పకుండా కుటుంబం మీద పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి పాపాలు చేయడం వల్ల తప్పకుండా పిల్లలు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని అంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఉండే విధానం, చేసే మంచి పనుల వల్ల భవిష్యత్తులో మీ పిల్లలు, ముందు తరాల వాళ్ల జీవితం ఆధార పడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.