Honey Spoil: తేనె ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఈ తేనెను ఎంత తింటే అంత మంచిది. దీన్ని ఉపయోగించే విధానాలను బట్టి దాని ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందం, ఆరోగ్యం, పూజలో ఇలా ఏ విధంగా అయినా సరే తేనె ముందు ఉంటుంది. ఆరోగ్యం కోసం తినవచ్చు. అందం కోసం ఉపయోగించవచ్చు. పూజలు సమర్పించవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ తేనె పాడవదు అనే విషయం మీరు గమనించారా? మరి ఎందుకు తేనె పాడవదు. ప్రతి వస్తువుకు ఎక్స్ పైర్ డేట్ ఉంటుంది. కానీ తేనెకు మాత్రం ఉండదు. ఎందుకు అంటారు? అదే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందామా?
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
తేనెను సేకరించడానికి, తేనెటీగ పువ్వుల మకరందాన్ని పీలుస్తుంది. ఈ మకరందంలో అనేక రకాల చక్కెరలు, ప్రోటీన్లు, ఇతర రసాయనాలు ఉంటాయి. దానిలో కొంత భాగం నీరు కూడా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇంట్లో ఉండే చక్కెర మాదిరిగానే ఉండే సుక్రోజ్ చక్కెర ఉంటుంది. తేనెటీగ పువ్వుల మకరందాన్ని పీల్చుకుని దాని శరీరంలో సేకరిస్తుంది. దీని తరువాత, దాని శరీరంలో ఉన్న గ్రంథి నుంచి ఒక ఎంజైమ్ బయటకు వచ్చి ఈ మకరందంలో కలిసిపోతుంది.
పువ్వుల నుంచి, ఎంజైమ్‌ల నుంచి మకరందాన్ని పొందిన తర్వాత, అది తేనెగా మారుతుంది. ఎంజైమ్‌లను పొందిన తర్వాత, సుక్రోజ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఈ తేనె తేనెగూడులో సేకరిస్తుంది. అయితే ఈ తేనెలో తక్కువ మొత్తంలో నీరు ఉంటుందట. అందుకే అది నీటిని ఆకర్షిస్తుంది. ఏదైనా బ్యాక్టీరియా దానిని చేరుకున్నప్పుడల్లా, తేనె సహజంగా దాని నీటిని ఆకర్షిస్తుంది. కాబట్టి తేనె చెడిపోదు. బ్యాక్టీరియా చనిపోతుంది.
హెల్త్‌లైన్ పరిశోధన నివేదిక ప్రకారం, తేనెటీగల శరీరం నుంచి గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే ప్రత్యేక రకం ఎంజైమ్ బయటకు వస్తుంది. ఇది తేనెలో కలిసిపోతుంది. ఈ ఎంజైమ్ తేనెలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తేనె పూర్తిగా సిద్ధమైన వెంటనే, దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం ఏర్పడుతుంది. ఇది బ్యాక్టీరియా దానిలోకి చేరకుండా నిరోధిస్తుంది.
అన్ని రకాల తేనెల నాణ్యత ఒకేలా ఉంటుందా? లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది? ఎందుకంటే తేనెటీగలు ఎన్నో రకాల పూల నుంచి మకరందాన్ని సేకరిస్తుంటాయి. అందుకే ఇలాంటి కారణాల వల్ల తేనె నాణ్యత అనేక విషయాలపై ఆధారపడి ఉంటుందని సైన్స్ చెబుతోంది. తేనెటీగల జాతిలాగే, తేనెను సేకరించిన పువ్వు జాతి కూడా ఉంటుంది. సాధారణంగా, తేనెలో 80 శాతం చక్కెర, 18 శాతం నీరు ఉంటుంది. దీని కారణంగా తేమ తక్కువగా ఉంటుంది, కాబట్టి అది చెడిపోదు. ఇదన్న మాట తేనె పాడవకుండా ఉండేందుకు రహస్యం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.