Thammudu Movie Collection: వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన యంగ్ హీరో నితిన్(Actor Nithin) రీసెంట్ గానే ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు ఈ చిత్రం పై కాస్త ప్రేక్షకుల్లో సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉండేది. అందుకు కారణం ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ డైరెక్టర్ అవ్వడమే. ఇప్పటి వరకు ఈయన ఓ మై ఫ్రెండ్, మిడిల్ క్లాస్ అబ్బాయి, వకీల్ సాబ్ చిత్రాలు చేసాడు. ఈ మూడు కూడా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. మంచి కమర్షియల్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు. అందుకే వేణు శ్రీరామ్ ఈసారి కచ్చితంగా నితిన్ కి సూపర్ హిట్ ని అందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన గత చిత్రం ‘రాబిన్ హుడ్’ కంటే దారుణమైన సినిమాని అందిస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కోటి 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది నితిన్ కెరీర్ లోనే ఆల్ టైం లోయస్ట్ అని చెప్పొచ్చు. ఇక రెండవ రోజు అయితే మొదటి రోజు వసూళ్ళలో సగం వచ్చాయి. కేవలం 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ చిత్రం. మొత్తం మీద రెండు రోజులకు కలిపి కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 67 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 20 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నితిన్ కాబట్టి ఈ మాత్రమైనా వచ్చాయని, వేరే యంగ్ హీరో ఇదే సినిమా చేసుంటే జీరో షేర్స్ వచ్చేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా,ఓవర్సీస్ లో వచ్చిన వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకోవచ్చు. ఈ మూడు ప్రాంతాల నుండి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇంతకంటే డిజాస్టర్ సినిమాని నితిన్ కెరీర్ లో చూడలేము అని అనుకుంటున్న ప్రతీసారీ, నితిన్ నేను మీరు ఊహించిన దానికంటే పెద్ద డిజాస్టర్ ఇవ్వగలను అని నిరూపిస్తున్నాడు. తమ్ముడు చిత్రం కానీ, రాబిన్ హుడ్ చిత్రం కానీ, స్క్రిప్ట్ పరంగా తీసుకుంటే మంచి సినిమాలే. ఈ రెండు సినిమాలకు ప్రామిసింగ్ డైరెక్టర్స్ పని చేశారు కూడా. కానీ టేకింగ్ లో లోపాలు ఉండడం వల్లే ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇది కచ్చితంగా నితిన్ దురదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే దిల్ రాజు బ్యానర్ లో ఆయన ‘ఎల్లమ్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. కనీసం ఈ సినిమా అయినా ఆయన కెరీర్ ని గాడిలో పెడుతుందో లేదో చూడాలి.