Snoring: గురక ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా నివారించుకోవాలి?

Snoring: మనలో చాలా మందికి గురక అలవాటు ఉంటుంది. నిద్రలోకి జారుకున్న తరువాత గురక పెట్టే వారు ఉంటారు. గురక అంత మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గురక పెడితే ఇతరులకు కూడా ఇబ్బందే. గురక అనేక వ్యాధులకు సంకేతంగా భావిస్తారు. గురక పెడితే దాంతో చాలా రకాల వ్యాధులు చుట్టుముట్టే సూచనలున్నాయి. గురక పెడితే పక్కన ఉన్న వారికి నిద్ర రావడం కష్టమే. నిద్రలో గురక పెడితే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. అసలు […]

Written By: Srinivas, Updated On : November 26, 2022 2:45 pm
Follow us on

Snoring: మనలో చాలా మందికి గురక అలవాటు ఉంటుంది. నిద్రలోకి జారుకున్న తరువాత గురక పెట్టే వారు ఉంటారు. గురక అంత మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గురక పెడితే ఇతరులకు కూడా ఇబ్బందే. గురక అనేక వ్యాధులకు సంకేతంగా భావిస్తారు. గురక పెడితే దాంతో చాలా రకాల వ్యాధులు చుట్టుముట్టే సూచనలున్నాయి. గురక పెడితే పక్కన ఉన్న వారికి నిద్ర రావడం కష్టమే. నిద్రలో గురక పెడితే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు.

Snoring

అసలు గురక ఎందుకు వస్తుంది? శ్వాస తీసుకోవడం మరియు వదులుతున్నప్పుడు మెడ, తలలో వైబ్రేషన్ కారణంగా గురక రావడం సహజమే. గురక వల్ల ముక్కు రంధ్రాల, టాన్సిల్స్, నోటి పై భాగంలో ఉంటాయి. నిద్ర పోతున్నప్పుడు ఏమవుతుంది? వాయుమార్గం రిలాక్స్ గా ఉంటుంది. ఆ సమయంలో గాలి చాలా బలవంతంగా లోపలికి వెళుతుంది. దీంతో కంపనాలు వస్తాయి. గురకను తగ్గించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడుతుంది. దీంతో అంగిలి వెనుక మృదువుగా ఉండే భాగం పొడవు పెరుగుతుంది. ముక్కులో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాం. దీంతో గాలి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించే సమయంలో గురక వస్తుంది. ముక్కు నుంచి శబ్దాలు వస్తాయి.

ప్రతి రోజు గురక పెడుతున్నట్లయితే కొన్ని ప్రమాదకర సమస్యలు వస్తాయి. గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కవే. గురక వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు 40 శాతం ఉంటాయని చెబుతున్నారు. గురకకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. గురక వల్ల ఇంకా పలు రకాల రోగాలు వ్యాపించే సూచనలున్నాయి. గురక వల్ల కలిగే శబ్ధాలు కూడా అందరిని ఇబ్బంది పెడతాయి. గురక వల్ల ఇన్ని రకాల జబ్బులకు కారణమైన గురకను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Snoring

గురక ఎవరికి వస్తుంది? అధిక బరువు ఉన్న వారికి గురక వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. నిద్ర పోయేటప్పుడు పొజిషన్లో మార్పులు చేసుకోవాలి. పక్కకు తిరిగి పడుకుంటే గురక సమస్య తగ్గుతుంది. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం. శరీరం డీహైడ్రేషన్ కు గురవకుండా మంచినీళ్లు తాగాలి. నీరు ఎక్కువగా తాగితే కూడా గురక సమస్య ఉండదు. డైరీ వస్తువులను తీసుకోవడం కూడా మంచిది కాదు. వాటిని తీసుకుంటే కూడా గురక సమస్య తలెత్తుతుంది.

Tags