Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Rare Photo: 1995లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో తెలుసా?

Pawan Kalyan Rare Photo: 1995లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో తెలుసా?

Pawan Kalyan Rare Photo: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిరంజీవి చిన్న తమ్ముడిగా అందరికి పరిచయమే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు పరిశ్రమలో తెరంగేట్రం చేశాడు. తనదైన శైలిలో చిత్రాలు తీస్తూ తనలోని నటనకు కొత్త భాష్యం చెప్పాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకు ఎంతో వైవిధ్యం చూపించాడు. పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీ సమయంలో వెన్నంటి ఉండి పార్టీని ముందుకు నడిపించాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి యువతను పార్టీ వైపు వచ్చేలా చేశారు.

Pawan Kalyan Rare Photo
Pawan Kalyan Rare Photo

ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. మూడేళ్లు విరామం తరువాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. పవన్ కల్యాణ్ 1995లో విశాఖపట్నంకు చెందిన నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తరువాత ఏమైందో ఏమో కానీ కొంత కాలానికి ఆమె పుట్టింటికి చేరింది. దీంతో పవన్ బద్రి సినిమాలో తనతోపాటు నటించిన రేణుదేశాయ్ తో సహజీవనం చేశారు. అప్పటికి నందిని విడాకులు ఇవ్వకున్నా రేణుదేశాయ్ ని రెండో వివాహం చేసుకున్నారు.

2005లో విడాకులు కావాలని దరఖాస్తు చేసుకోగా 2008లో మంజూరయ్యాయి. ఆ సమయంలో నందినికి రూ. 5 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తరువాత రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకుని సినిమాల్లో బిజీగా మారిపోయారు. తరువాత కాలంలో ఆమెకు కూడా దూరమై మూడో పెళ్లి చేసుకున్నారు. రేణుదేశాయ్ పవన్ కల్యాణ్ కు జన్మించిన కుమారుడు అకీరా నందన్ కూడా సినిమాల్లోకి రానున్నాడు. తమ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ ఆధ్వర్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు.

Pawan Kalyan Rare Photo
Pawan Kalyan Rare Photo

పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డారు. సినిమాల్లోకి రావడానికి కూడా ఎంతో కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఒక దశలో ఆయన బెంగుళూరులో వ్యాపారం చేయాలని భావించారు. తన భవిష్యత్ ఇంత గందరగోళంగా ఉంటుందా అని వ్యథ చెందారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుని తనదైన శక్తి ప్రదర్శించారు. అలా సినిమాల్లో రాణించి పవన్ కల్యాణ్ అంటే పవర్ స్టార్ అని చెప్పుకునే స్థాయికి చేరారు. పవర్ స్టార్ అని మొదట పిలిచింది రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. అలా తన ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version