Pregnancy: తల్లి కావడం ప్రతి ఒక్క అమ్మాయికి కల. అమ్మ అవడం అంటే అదృష్టంగా భావిస్తారు. కానీ చాలా మందికి ఇప్పుడు ఇదొక టాస్క్ గా మారింది. పిల్లలు పుట్టడం అంటే చాలా సమస్య అవుతుంది. హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సరే కొందరికి పిల్లలు పుట్టడం లేదు. అయితే కొందరు పుట్టబోయే శిశువు మగబిడ్డనా, ఆడనా అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నేరం కూడా. అయితే తిండిపై కోరికల ఆధారంగా పిల్లల లింగాన్ని చెబుతారు కొందరు. మీకు స్వీట్లు తినాలని అనిపిస్తే ఆడపిల్ల అని, స్పైసీగా తినాలనిపిస్తే అబ్బాయి అని అంటారు. ఈ వాదనలో ఎంత నిజం ఉందో డైటీషియన్ శిఖా శర్మ అగర్వాల్ నుంచి తెలుసుకుందాం.
చాలా మంది ప్రజలు గర్భధారణ కోరికలను లింగంతో ముడిపెడతారు. గర్భధారణ సమయంలో, తీపి ఆహారం తినాలి అనిపిస్తే కుమార్తె అని పులుపు, కారపు ఆహారం తినాలి అనిపిస్తే కొడుకు పుడుతారు అని చాలా మంది నమ్ముతారు. అయితే వైద్యులు మాత్రం దీన్ని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. కేవలం ఆహారం లింగాన్ని నిర్దారించదని.. కచ్చితంగా ఇది ఒక పిచ్చి నమ్మకం అంటున్నారు. ఫుడ్ వల్ లింగ నిర్ధారణ చేసుకొని కోరికలు పెంచుకోవడం వల్ల తర్వాత బాధ పడతారు అని.. ఇలాంటి అలవాటు మానుకోవాలి అంటున్నారు నిపుణులు.
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఈ హార్మోన్ల మార్పుల వల్ల తీపి లేదా కారంగా ఉండే ఆహారాన్ని తినాలని అనిపిస్తుంది. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో తీపి లేదా కారంగా ఉండే ఆహారాన్ని తినాలనే కోరిక ఉండవచ్చని, అయితే అది పిల్లలకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో తీపి, కారపు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆహార కోరికలు లేదా పొట్ట పరిమాణం చూసి పిల్లల లింగాన్ని నిర్ణయించలేము. ఎందుకంటే గర్భధారణ సమయంలో కోరికలు సాధారణం.
డైరీ ప్రొడక్ట్స్, సీ ఫుడ్, నట్స్, జింక్ అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. సోయాబీన్, క్యాబేజీ, బ్రకోలీని తక్కువగా తినండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయండి. దీనితో పాటు, తగినంత నీరు తాగాలి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల మీ జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక గర్భధారణ సమయంలో మహిళలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో రెగ్యులర్ థైరాయిడ్ పరీక్ష చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇప్పటికే థైరాయిడ్ సమస్యలు ఉన్న మహిళలు మరింత జాగ్రత్త పడాలి. హైపోథైరాయిడిజం కోసం థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్‌మెంట్, హైపర్ థైరాయిడిజం కోసం యాంటీ థైరాయిడ్ మందులు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..