కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనిపించే లక్షణాలు ఇవే..?

దేశంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. తొలి దశలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరగనుండగా వ్యాక్సిన్ ను కేంద్రం ఉచితంగానే పంపిణీ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు వ్యాక్సిన్ల గురించి వెల్లడిస్తున్నారు. Also Read: భవిష్యత్తులో కరోనా వైరస్ సాధారణ జలుబులా మారిపోతుందా..? అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత […]

Written By: Navya, Updated On : January 16, 2021 11:58 am
Follow us on

దేశంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. తొలి దశలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరగనుండగా వ్యాక్సిన్ ను కేంద్రం ఉచితంగానే పంపిణీ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు వ్యాక్సిన్ల గురించి వెల్లడిస్తున్నారు.

Also Read: భవిష్యత్తులో కరోనా వైరస్ సాధారణ జలుబులా మారిపోతుందా..?

అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత దురదలు, కండరాల నొప్పి, జ్వరం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయని ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనిపించే సైడ్ ఎఫెక్ట్స్ రెండు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతున్నాయని ఆ లక్షణాల గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Also Read: మీలో ఈ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా.. ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కడుపులో వికారం, చలి, జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, చర్మం సెన్సిటివ్ గా మారడం, వ్యాక్సిన్ తీసుకున్న ప్రదేశంలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దగ్గు, జలుబు, చమట పట్టడం, వికారం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, ఇతర అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తే పారాసెటమాల్ తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తొలి డోస్ కంటే రెండో డోస్ వ్యాక్సిన్ ను తీసుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.