Soaked Nuts : నానబెట్టిన గింజలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తారు నిపుణులు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో విటమిన్ల సమూహం ఈ నానబెట్టిన గింజలు. ఇవి శరీరంలో శక్తిని పెంచుతాయి. మరి వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎప్పుడు తినాలి అనే వివరాలు తెలుసుకుందాం..
నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాదు జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా తోడ్పడుతుంది. అయితే ఈ నానబెట్టిన గింజలను ఉదయం తీసుకుంటే బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు.
కొన్ని కిలోల బరువు తగ్గాలి అనుకుంటే పిస్తా, వాల్ నట్స్ లను నానబెట్టి తినండి. దీని వల్ల తొందరగా రిజల్ట్ వస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఈ నానబెట్టిన గింజలు మంచి పాత్రను పోషిస్తాయి. వీటివల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉందండోయ్..అదేంటి అంటే..
ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె సమస్యల వల్ల సతమతమవుతున్నారు. అయితే నానబెట్టిన గింజలను తిన్న వారికి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. ఇక ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో వాల్ నట్స్ బాదం ప్రధాన పాత్ర పోషిస్తాయట. మరి ఇంకెందుకు ఆలస్యం నానబెట్టిన గింజల వలను ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా.. వీలుంటే తినేయండి. కానీ ఒకసారి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. మేము ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.