Mosquito Plant: వర్షాకాలంలో దోమల (Mosquitoes) సమస్య ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. దోమకాటు వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. వర్షాకాలంలో దోమల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు కుట్టకుండా ఉండాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మురుగు కాల్వలో నీళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ, మలేరియా కొన్నిసార్లు ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం ద్వారా దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇంట్లో సులభంగా మేరిగోల్డ్ పూలను పెంచుకోవచ్చు. బంతి పూలు సులభంగా బాల్కనీ అందాన్ని పెంచడంతో పాటు ఫ్లైస్ దోమలను తరిమికొట్టడంలో బంతిపూలు తోడ్పడతాయి. పసుపు, ముదురు నారింజ, ఎరుపు రంగులలో బంతిపూలు ఉంటాయి. మన ఇంట్లో ఎక్కువగా పూజ చేసే మొక్కలలో తులసి ఒకటి.
తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. దోమలను తిప్పికొట్టడంలో ప్రభావవంతంగా పని చేసే మొక్కలలో లావెండర్ ఒకటి. దోమల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్ లో ఉన్న కెమికల్స్ ను వాడితే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
లావెండర్ నూనెను చర్మంపై రాసుకోవడం ద్వారా దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. నీలం రంగులో ఉండే రోజ్మెరీ పూలు దోమలకు సులువుగా చెక్ పెడతాయి. రోజ్‌మేరీని పావు వంతు ఆలివ్ నూనెతో కలిపి చర్మంపై రాసుకుంటే దోమలకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సిట్రోనెల్లా గడ్డి ద్వారా దోమలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. డెంగ్యూ, మలేరియా దోమలను దూరంగా ఉంచడంలో సిట్రోనెల్లా గడ్డి తోడ్పడుతుంది.