పవర్ స్టార్ కు ఉన్నంత మంది ఫ్యాన్స్ ఏ హీరోకు ఉండరు. ఆయన ఫాలోయింగ్ అంటే అలా ఉంటుంది. అలాంటి స్టార్ హీరో తన పేరు పక్కన పవర్ స్టార్ పేరును తొలగించుకోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సినిమాకు కాదు వరుసగా నాలుగు సినిమా పోస్టర్లలో ఆయన పేరు పక్కన పవర్ స్టార్ కనిపించడం లేదు. దీంతో ఇది యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే తీసేశారా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పేరు కంటే ముందు పవర్ స్టార్ ఉంటేనే దానికి ఓ లెక్క ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం.
2018లో సినిమాలకు టాటా చెప్పిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. జనసేన పార్టీ స్థాపించి ఫుల్ టైం పొలిటిషియన్ గా ఉండాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమా తీసి అందరిని మెప్పించారు. తనలోని నటనా కౌశలాన్ని బయటపెట్టారు. తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన పేరు పక్కన ఉండే స్టార్ ట్యాగ్ ను ఎప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆయనే పవర్ స్టార్ ను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
తాను జనసేన పార్టీతో జనానికి సేవ చేయాలని భావిస్తున్న తరుణంలో పవర్ స్టార్ అంటే బాగుండదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే తన పేరు పక్కన లీడర్, జనసేనాని అనే పదాలు ఉంటే బాగుంటుందని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పవర్ స్టార్ అనేది ఆయనకు తప్ప వేరే వారికి సరిపోదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆయన ఉన్నంత కాలం ఆయనకే పవర్ స్టార్ ఉండాలని పట్టు పడుతున్నారు. ఏది ఏమైనా పవర్ స్టార్ పదం ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోతోందనడంలో సందేహం లేదు.