Avoid Health Problems: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన వంటింట్లో ఉండే పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడతాయనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో ఆరోగ్య సంరక్షణలో ఏమరుపాటుగా ఉండటంతో భారీ మూల్యమే చెల్లించుకుంటున్నారు. దీర్ఘకాల రోగాల బారిన పడి జీవితాన్ని కకావికలం చేసుకుంటున్నారు. జంతువులకు లేని వ్యాధులు మనుషులకు ఎందుకు వస్తున్నాయి. మనిషి ఆహార అలవాట్లు గతితప్పుతున్నాయి. తినకూడనివి ఎక్కువగా తింటూ మనకు రక్షణగా నిలిచే వాటిని దూరం చేస్తున్నారు. దీంతోనే రోగాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం తీసుకునే ఆహారమే ప్రధాన భూమిక పోషిస్తుంది.
పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోకుండా ఎలాంటి ప్రొటీన్లు లేని పదార్థాలను తీసుకోవడంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో పలు సమస్యలు చుట్టుముడతాయి. కానీ వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. వేలకు వేలు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తున్నారు కానీ పోషకాహారం తీసుకోవడానికి మాత్రం మొగ్గు చూపడం లేదు. ఫలితంగా ఎన్నో రకాల జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. వేళ ప్రకారం తిండి తినకుండా ఇష్టమొచ్చిన సమయంలో తింటూ కడుపును కీకారణ్యం చేస్తున్నారు. దీంతో తిన్నది జీర్ణం కాక వ్యాధులను దగ్గర చేసుకుంటున్నాం.
Also Read: Nayanthara: నయనతార పిల్లల్ని కంటే చనిపోతుంది.. కారణం అదే.. షాక్ అవుతున్న ఫ్యాన్స్ !
తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే పీచు పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. తృణ ధాన్యాలతో కూడా మేలు జరుగుతుంది. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి వాటిని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల మంచినీరు తాగుతుండాలి. వీలైనంత వరకు బయట తిండి మానేయాలి. ఇంట్లో తయారు చేసుకున్న వాటిని తింటేనే ప్రయోజనం. బయటి తిండ్లతో అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే. దీంతో బయట వండే వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం.
బార్లీ, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, గోధుమ పిండి వంటి వాటితో మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మనకు ఎంతో సహాయపడుతుంది. మనం తీసుకునే భోజనమే మనకు శ్రీరామరక్షగా భావించుకోవాలి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమనే నానుడి వచ్చిందని తెలుస్తోంది. భోజనం విషయంలో అశ్రద్ధ పనికిరాదు.
ప్రతి రోజు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. దీంతో బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. యోగా కూడా అరగంట చేయాలి. దీంతో మానసిక స్థితి బాగుంటుంది. శరీరంలో అన్ని అవయవాలు బాగా పనిచేయడానికి ఇవి ఉపకరిస్తాయి. రోజుకు కనీసం ఆరు గంటలైనా నిద్ర పోవాలి. నిద్రలో కూడా మన అవయవాలు విశ్రాంతి తీసుకుని మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి తోడ్పడతాయి. ఇవి కచ్చితంగా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న పరిస్థితుల్లో మన జీవన విధానం కూడా మారాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి.