Healthy Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది. మన అవయవాలకు మనం తీసుకునే ఆహారంతోనే మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు మనం పోషకాలు, విటమిన్లు, ప్రొటీన్లతో ముడిపడి ఉండే ఆహార పదార్థాలతోనే ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత కాలంలో ఫాస్ట్ ఫుడ్స్ కు ఎక్కువ అలవాటు పడుతున్నారు. బేకరి రుచులతో మనకు అనారోగ్యం దరి చేరడం ఖాయమని తెలిసినా మానడం లేదు. దీంతో రోజురోజుకు దురవాట్లు పెంచుకుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేందుకు పరోక్షంగా కారకులవుతున్నారు.

ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ చేయడం లేదు. దీంతో అవయవాలు బద్ధకంగా మారుతున్నాయి. అందరు కంప్యూటర్ల ముందు కూర్చుని వేళ్లు కదిలించడమే చేస్తుండటంతో రక్తప్రసరణ సరిగా కావడం లేదు. దీంతో మన శరీరం గుళ్లబారడం మామూలుగా జరుగుతోంది. దీంతోనే మనకు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఒంటికి ఎలాంటి శ్రమ లేకపోవడంతో చెమట పట్టడం లేదు. ఫలితంగా మనకు పలు రకాల రోగాలు వ్యాపిస్తున్నాయి. ముప్పై ఏళ్లకే మధుమేహం, రక్తపోటులు వచ్చి వేధిస్తున్నాయి. జీవితాంతం వాటితో మనుగడ కొనసాగించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

Diabetes
వ్యాయామం కూడా మనిషికి మంచిదే. ఏ పని చేయని వారు కచ్చితంగా రోజు నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం చేస్తుండాలి. అప్పుడే మన అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మన ఆరోగ్యానికి వ్యాయామం కూడా కారణంగా చెబుతారు వైద్యులు. నేటి కాలంలో అందరు కూర్చుండి చేసే పనుల వల్ల శరీర భాగాలు వంచాల్సిన అవసరం ఉన్నందున వ్యాయామం చేస్తేనే బాగుంటుంది. వాకింగ్, జాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఆట ఏదైనా సరే మనం పాటిస్తే ఫలితం కచ్చితంగా ఉంటుంది.

భోజనానికి ముందు ఒక పండు తినాలి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకో ఆపిల్ తింటే వైద్యుడి దగ్గరకు పోవాల్సిన పనిలేదని ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆరోగ్యంగా జీవించాలంటే పండు ప్రధాన పాత్ర పోషిస్తుందన్న మాట వాస్తవమే. దీని కోసం మనం చేయాల్సింది రోజు భోజనానికి ఒక పండు తింటే చాలు. అది ఆపిల్ అయినా సరే బత్తాయి అయినా సరే ఏదైనా పండు తీసుకుంటే చాలు.
Also Read: Narendra Modi: అమెరికా మీడియాలో మోదీ పతాక శీర్షిక.. పుతిన్‌కు చేసిన సూచనకు ప్రాధాన్యం

ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం మానేయకూడదు. ఉపవాసాలు చేయకూడదు. గంటల తరబడి పొట్టను ఖాళీగా ఉంచడం వల్ల సమస్యలు వస్తాయి. మెటబాలిజం దెబ్బతిని అనారోగ్యం ఆవహిస్తుంది. మాంసకృత్తులు, పీచుపదార్థాలు ఎక్కువా ఉన్న స్నాక్స్ తింటుంటే ఆకలి వేయదు. మన ఆరోగ్యానికి నిద్ర కూడా అవసరమే. రోజుకు కనీసం ఆరు గంటలైనా నిద్ర పోవాలి. నిద్రలోనే మన శరీర అవయవాలు విశ్రాంతి తీసుకుని శరీరం ఉత్సాహంగా తయారవుతుంది. పనుల్లో చురుకుదనం కూడా వస్తుంది. మన ఆరోగ్యంపై నిద్ర కూడా ప్రభావం చూపుతుంది