Iron rich foods for Kids: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే సరైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. అంటే తల్లిదండ్రులే తమ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం వల్ల వారు పెద్దయ్యాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పౌష్టికాహారంలో భాగంగా పిల్లలకు ఐరన్ ఖనిజం చాలా అవసరం. అయితే ఐరన్ ఖనిజం లభించే ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. రక్తంలో హిమోగ్లోబిన్ తయారు కావడంలో ఐరన్ ముఖ్యపాత్ర వహిస్తుంది. అయితే ఏ వయసు పిల్లలకు ఎంత ఐరన్ అవసరం? ఇలాంటి ఆహారంలో ఐరన్ దొరుకుతుంది?
సాధారణంగా ఆరు నెలల లోపు పిల్లలకు ఐరన్ ఖనిజం తల్లిపాలలో వస్తుంది. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పిల్లలకు 11 మిల్లీగ్రాములు అవసరం ఉంటుంది. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వారికి 7 మిల్లి గ్రాములు, నాలుగు నుంచి 8 సంవత్సరాల వరకు 10 మిల్లీ గ్రాములు.. 9 నుంచి 13 సంవత్సరాల వరకు 8 మిల్లీగ్రాములు.. పట్టాల నుంచి 18 సంవత్సరాల వరకు 11 మిల్లీగ్రాముల ఐరన్ ఆహారంలో అందించడం వల్ల రక్తం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
అయితే మనం ప్రతిరోజు ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. కానీ పిల్లలకు మాత్రం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినిపించడం వల్ల వారు నిత్యం ఆక్టివ్ గా ఉండగలుగుతారు. ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాల్లో పాలకూర, బచ్చలి వంటి వాటిల్లో ఐరన్ లభిస్తుంది. అలాగే బీన్స్, మినుములు,, బంగాళదుంపలు, సజ్జలు, రాగులు వంటి పదార్థాల్లో ఐరన్ ఉంటుంది. అయితే ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాల పండ్లలో కూడా ఐరన్ ఉంటుంది. వాటిలో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, పల్లీలు, కోడిగుడ్డు వాటిల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇక నారింజ, మామిడి, టమాట, ఉసిరి వంటి సి విటమిన్ కలిగిన పండ్ల లోను ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
పిల్లల్లో ఐరన్ లోపం ఉండడం వల్ల కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వారు బలహీనతంగా ఉండడం, ఎప్పుడు అలసటగా కనిపించడం, చర్మం తెల్లగా కనిపించడం, సరైన దృష్టి కేంద్రీకరించకపోవడం, శ్వాస తీసుకోకపోవడం వంటివి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే కొన్ని రకాల ఐరన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వారిలో కొంతవరకు సమస్య పరిష్కరించుకోగలుగుతారు. అయినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వైద్యులను సంప్రదించాలి. కానీ అంతకంటే ముందే ఐరన్ ఫుడ్ ఎక్కువగా తినిపించాలి. అలా తినిపించడంతో వారిలో సరైన విధంగా రక్తప్రసరణ జరిగి ఆక్టివ్ గా ఉండగలుగుతారు.