Vishwak Sen Scolds Fans: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్(Viswak Sen). ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్, హిట్, ఆకాశవనంలో అర్జున కళ్యాణం, పాగల్ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఈయన కెరీర్ లో ఉన్నాయి. కానీ ఈమధ్య కాలం లో వరుసగా డిజాస్టర్ సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ఈయన నుండి విడుదలైన మెకానిక్ రాకీ, లైలా చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడమే కాకుండా, ఇలాంటి చెత్త సినిమాలు చేసినందుకు విశ్వక్ సేన్ స్వయంగా అభిమానులకు క్షమాపణలు చెప్తూ బహిరంగ లేఖ కూడా విడుదల చేయాల్సి వచ్చింది. అయితే ఈ యంగ్ హీరో కి కాస్త యాటిట్యూడ్ ఎక్కువ అని అందరూ అంటుంటారు. అభిమానులను లెక్క చేయడు, చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది.
రీసెంట్ గా ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి చూస్తే అదంతా నిజమే అని అనిపిస్తుంది. దీపావళి సందర్భంగా విశ్వక్ సేన్ తన కుటుంబం తో కలిసి సంబరాలు చేసుకుంటున్నాడు. అయితే అభిమానులు అదే సమయం లో ఆయన్ని చూసేందుకు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన అభిమానులను ప్రేమతో పలకరించాల్సింది పోయి ‘దీపావళి పండుగ లేదారా మీకు’ అని అంటాడు. అంటే పండగ చేసుకోకుండా మా ఇంటి దగ్గరకు ఎందుకు వచ్చారు రా,పని పాట ఏమి లేదా అని దాని అర్థం. అప్పటికీ కూడా అభిమానులు ‘ఒక్కసారి మా కోసం క్రిందకు వస్తే..మీ ఫ్యామిలీ తో ఒక వీడియో తీసుకుంటాము అన్నా’ అని అంటారు. అప్పుడు విశ్వక్ సేన్ ‘హ్యాపీ దీపావళి’ అని చెప్పి చేతులు ఊపి వెళ్ళిపోయాడు. అంత దూరం ప్రేమతో చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రవర్తించే తీరు ఇదేనా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది అయితే ‘పండగ రోజు వాడి ఇంటికి వెళ్లి తిట్టించుకోవడం అవసరమా?’ అని అక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ ని తిట్టారు. మరికొంతమంది అయితే ‘మాములు పొగరు కాదు.. రెండు మూడు భారీ హిట్స్ ఉంటే ఇంకెలా ప్రవర్తించేవాడో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కూడా తమ ఇంటికి వచ్చిన అభిమానులను ప్రేమతో పలకరించి పంపిస్తారు. కుదిరితే ఇంటి లోపలకు పిలిచి సెల్ఫీ ఇచ్చి, కడుపునిండా భోజనం పెట్టి పంపుతారు. ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ స్థాయికి వచ్చిన ప్రతీ ఒక్కరు అభిమానులతో ఇలాగే ప్రవర్తిస్తారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఇలా ప్రవర్తించడం అసలు బాగాలేదు అంటూ నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
పండుగ పుట వాడి ఇంటికి వెళ్ళి మాటలు అనిపించుకోవడం ఎందుకు pic.twitter.com/IlTO6iF3pZ
— 000009 (@ui000009) October 21, 2025