Cheese- Butter Difference: చీజ్, బటర్, మయొన్నైస్‌.. ఆరోగ్యానికి ఏది మంచితో తెలుసా?

జున్నును.. పెరుగు నుంచి తయారుచేస్తారు. పెరుగులోని నీటిని తొలగించి.. ఉప్పు కలిపి.. నిల్వచేయడం ద్వారా దీన్ని తయారుచేస్తారు. జున్ను మెత్తగా, క్రీమీగా ఉంటూనే.. కాస్త గట్టిగా కూడా ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : May 8, 2023 3:41 pm

Cheese- Butter Difference

Follow us on

Cheese- Butter Difference: కాలం మారేకొద్దీ మార్కెట్‌లోకి రకరకాల ఉత్పత్తులు వస్తున్నాయి. వాటిపై మనకు అవగాహన లేకపోతే.. ఇబ్బంది పడతాం. ప్రస్తుతం వెన్న, జున్ను, మయొన్నైస్‌ మార్కెట్లను మంచెత్తుతున్నాయి. మాల్స్‌లో అయితే డిస్కౌంట్స్, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లతో అమ్ముతున్నారు. అయితే వీటి మధ్య తేడాలు ఏమిటి, తయారీ విధానం, వాడకం, ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకుందాం.

చీజ్‌ అంటే జున్ను, బటర్‌ అంటే వెన్న, మయొన్నైస్‌ని.. తెలుగులో మయొన్నైస్‌ అనే అంటున్నాం. ఇది కొత్తది.. చూడటానికి ఇవన్నీ ఒకేలా కనిపిస్తాయి. పాలతో తయారైనట్లే ఉంటాయి. కానీ వీటి మధ్య తేడాలున్నాయి.

జున్ను :
జున్నును.. పెరుగు నుంచి తయారుచేస్తారు. పెరుగులోని నీటిని తొలగించి.. ఉప్పు కలిపి.. నిల్వచేయడం ద్వారా దీన్ని తయారుచేస్తారు. జున్ను మెత్తగా, క్రీమీగా ఉంటూనే.. కాస్త గట్టిగా కూడా ఉంటుంది. దీని రుచి కమ్మగా ఉన్నట్లు అనిపించినా.. కొంత చేదుగా ఉంటుంది. అందుకే ఇళ్లలో తయారుచేసే జున్నులో మిరియాల పొడి కలుపుతారు. జున్నును డైరెక్టుగా తింటారు. ఆహార పదార్థాలపై గార్నిష్‌గా కూడా చల్లుతారు. స్నాక్స్‌లో దీన్ని ఎక్కువగా వాడుతారు. వేడి ఆహారంపై చల్లినప్పుడు వెంటనే కరిగిపోతుంది. ఆహారానికి ప్రత్యేక ఫ్లేవర్‌ ఇస్తుంది. పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, పాస్తాలు, సలాడ్లలో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది.

వెన్న :
వెన్న సంగతి మనకు బాగా తెలుసు. మజ్జిగను చిలికినప్పుడు వెన్న వస్తుంది. ఇది కాస్త ముద్దగా, మందంగా, క్రీమీగా, స్మూత్‌గా ఉంటుంది. వెన్నను ఫ్రిజ్‌లో పెడితే.. గట్టిపడుతుంది. వెన్న రుచి చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది. ఈ రోజుల్లో రకరకాల ఫ్లేవర్స్‌లో కూడా వెన్న లభిస్తోంది. ఈ వెన్నను వంటలు, బేకింగ్‌లో ఎక్కువగా వాడుతున్నారు. ఇది వంటకు మంచి ఫ్లేవర్‌ తెస్తుంది. ఆహారంలో తేమను పెంచి.. రుచికరంగా మార్చేస్తుంది. ్రౖఫై లు, బేకింగ్‌ కోసం బటర్‌ ఎక్కువగా వాడుతున్నారు. బ్రెడ్, టోస్టులపై వెన్నను రాయడం ద్వారా వాటి రుచి అమోఘంగా ఉంటుంది.

మయొన్నైస్‌:
మనకు పెద్దగా పరిచయం లేనిది మయొన్నైస్‌. ఇప్పుడిప్పుడే భారతీయులు కూడా దీన్ని వాడుతున్నారు. ఇది కూడా జున్ను, వెన్నలాగా కనిపిస్తుంది. ఇదో క్రీమీ సాస్‌. దీన్ని నూనె, గుడ్డులో పచ్చ సొన, వెనిగర్, నిమ్మరసం, సీజనింగ్స్‌తో తయారుచేస్తారు. గుడ్ల పచ్చ సొనను చిలుకుతూ… క్రమంగా నూనె కలుపుతూ… చిక్కని క్రీమ్‌ తయారుచేస్తారు. ఇది కూడా నోట్లో పెట్టుకోగానే.. అతుక్కుంటుంది. కరిగిపోతుంది. కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఇందులో రకరకాల రుచులు ఉన్నాయి. మయొన్నైస్‌ని రకరకాల కూరల్లో వాడుతున్నారు. దీన్ని కూడా శాండ్‌విచ్‌లు, సలాడ్లపై వేస్తున్నారు. తద్వారా వాటికి మంచి రుచి రావడమే కాదు.. లుక్‌ కూడా చాలా బాగుంటాయి. ఐతే.. వెన్న, జున్ను బదులు.. దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతం ఈ మూడింటి ధరలూ అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి.

వెన్న, జున్ను, మయొన్నైస్‌.. ఈ మూడింటిలో వెన్న, జున్ను సహజంగా తయారు చేసేవి. మయొన్నైస్‌ మాత్రం కృత్రిమంగా తయారు చేసేది. అయితే ఇటీవలి కాలంలో వెన్న, జున్నును కూడా వివిధ రసాయనాలతో యారు చేస్తున్నారు. నేచురల్‌ పదార్థాలతో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. కృత్రిమంగా, రసాయనాలతో చేసే పదార్థాలు ఏవైనా, ఎంత రుచికరమైనా, ఎంత తాజాగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమే.