Health Tips: ఈ భూమ్మీద ఉన్న ప్రాణకోటికి నీరు కచ్చితంగా అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి నిలబడదు. మనుషులైకైతే నీటి చుక్క లేనిది రోజే గడవదు. అయితే ఏ ద్రవమైన పద్దతిగా తీసుకోవాలి. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి 80 శాతం నీరు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఎక్కువగా నీరు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రం నీటిని అస్సులు తీసుకోవద్దని చెబతున్నారు. ఈ సమయంలో మీరు నీరు తీసుకుండే దీర్ఘ కాలిక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎప్పుడు నీరు తీసుకోవద్దో చూద్దాం.
ఉదయం లేచిందగ్గర్నుంచి రాత్రి వరకు రకరకాల ఆహారాన్ని తింటూ ఉంటారు. మార్కెట్లో దొరికే పానీయాలు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు కచ్చితంగా రోజుకు రెండు నుంచి మూడు సార్లు టీ తీసుకోవడం అలవాటు ఉంటుంది. కొందరైతే గంటకోసారి టీ తాగనిదే వారికి రోజూ గడవదు. టీ తాగడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. అందులో ఉండే మూలకాలు శరీరానికి ఉత్తేజాన్ని తెస్తాయి. ఇంట్లో ఉదయం టీ తాగడం వల్ల ఆ రోజంతా పనులన్నీ చక్కగా చేస్తామనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది.
అయితే టీ ఎక్కువ తాగడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చాలా కథలు చదివాం. దీంతో చాలా మంది టీ తాగడం తగ్గిస్తున్నారు. రోజూ ఒకటి, రెండు సార్లు మాత్రమే టీ తాగుతున్నా.. ఈ సమయంలో కొన్ని మిస్టేక్ చేస్తున్నారు. అవేంటంటే కొంతమంది టీ తాగిన తరువాత మంచినీళ్లు తాగుతున్నారు. మరికొందరు టీ తాగే ముందు వాటర్ తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని కొందరు ఆరా తీస్తున్న సమయంలో కొందరు వైద్యులు విలువైన సూచలను బయటపెట్టారు.
టీ తాగిన తరువాత చాలా మందికి దాహం వేస్తుంది. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాటర్ తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల దంత క్షయం ఏర్పడుతుంది. అలాగే ఎసిడిటీ సమస్యలు వస్తాయి. శరీరం డీ హైడ్రేషన్ అవుతుంది. గొంతు నొప్పి వస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉండి గ్యాస్ సమస్యలు వస్తాయి. అందువల్ల టీ తాగిన తరువాత నీరు మాత్రమే కాకుండా ఏ ద్రవాలు తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు. అయితే కచ్చితంగా నీరు తీసుకోవాలని అనుకుంటే మాత్రం కనీసం అరగంట సేపు ఆగిన తరువాత తాగడం మంచిదని అంటున్నారు.
ఇక టీ తాగే ముందు నీటిని తీసుకోవడం మాత్రం మంచిదేనని అంటున్నారు. టీ తీసుకునేముందు నీరు తాగడం వల్ల ప్రేగులు నీటితో నిండి ఉంటాయి. దీంతో అమ్ల ప్రభావం ప్రేగులపై పడదు. దీనివల్ల ఎటువంటి సమస్య ఉండదని అంటున్నారు. అంతేకాకుండా తీవ్ర ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల టీ తీసుకుంటున్న సమయంలో నీరు పద్దతిగా తీసుకోవాలని అంటున్నారు.