https://oktelugu.com/

Couple: భార్యభర్తల మధ్య సుఖ సంసారం సాగాలంటే ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే?

Couple: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లికి ఉన్న బంధం అలాంటిది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. నూరేళ్ల సంసారంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అనుభూతులు ఉంటాయి. భార్యాభర్తలు సంతోషంగా కలిసి జీవించాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిపై స్పష్టత కావాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితాంతం వేదనకు గురికావాల్సి వస్తుంది. భార్యాభర్తల వయసులో ఎంత తేడా ఉండాలి? పూర్వ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 4, 2023 / 04:49 PM IST
    Follow us on

    Couple

    Couple: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లికి ఉన్న బంధం అలాంటిది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. నూరేళ్ల సంసారంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అనుభూతులు ఉంటాయి. భార్యాభర్తలు సంతోషంగా కలిసి జీవించాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిపై స్పష్టత కావాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితాంతం వేదనకు గురికావాల్సి వస్తుంది.

    భార్యాభర్తల వయసులో ఎంత తేడా ఉండాలి? పూర్వ కాలంలో అయితే బాల్య వివాహాలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ బాగా ఉంటే కుదరడం లేదు. వారి సంసారంలో కలతలు రావడం సహజంగా జరుగుతుంది. అందుకే భార్యాభర్తల వయసులో తేడా పెద్దగా ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి దాంపత్య జీవితం సవ్యంగా సాగాలంటే వయసులో ఎంత తేడా ఉంటే బాగుంటుందనే దానిపై ఎన్నో ఆధారాలు చూసుకోవాలి.

    Also Read: Balagam: బలగం కథ కాపీనా? ఆ జర్నలిస్టు స్టోరీ ఇదేనా? కాపీ ట్రోల్స్ వెనుక కథ ఇదీ..

    Couple

    ప్రస్తుతం పెళ్లి సంబంధాల్లోనే అమ్మాయి, అబ్బాయి వయసులో తేడాలు చూస్తున్నారు. వారి జాతకాలు కలిశాయో లేదో పరీక్షిస్తున్నారు. దీంతో ఇద్దరి వయసులో కూడా తేడా ఎంత ఉందనే విషయం ఆరా తీస్తున్నారు. ఒకరి రెండు సంవత్సరాలైతే ఫర్వాలేదు. కానీ వయసులో తేడా ఎక్కువగా ఉంటే వారి కాపురం సజావుగా సాగదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏజ్ గ్యాప్ అనేది ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందుతోంది. భార్యాభర్తల మధ్య 5-7 సంవత్సరాల గ్యాప్ ఉన్న జంట మధ్య వచ్చే గొడవలు, అపార్థాలు తక్కువగా ఉంటాయని తేలింది.

    భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ పది సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే సర్దుకోలేరని అధ్యయనంలో తేలింది. ఇక 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంటే పెళ్లి చేసుకోవడం కష్టమే. ఈ గ్యాప్ తో పెళ్లి చేసుకుంటే సంసారం సజావుగా సాగదని అంటారు. అందుకే దంపతుల మధ్య వయసులో తేడా ఐదారు సంవత్సరాలు ఉంటేనే బాగుంటుంది. ఏకంగా చాలా సంవత్సరాలు తేడా ఉంటే వారి జంట చూడ ముచ్చటగా ఉండదు. అలా చేస్తే అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయే సందర్భాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో భార్యాభర్తల్లో ఏజ్ గ్యాప్ ఉండకుండా చూసుకోవడమే బెటర్.

    Also Read: Ramcharan’s wife Upasana : భర్తకు తగ్గ భార్య… వ్యాపార రంగంలో చరణ్ వైఫ్ ఉపాసనకు అరుదైన గౌరవం!

    Tags