Body water deficiency: మానవ శరీరం సుమారు 60 శాతం వరకు నీటితో నిండి ఉంటుంది. ఈ నీరు ప్రతిరోజూ చెమట, మూత్ర విసర్జన ద్వారా బయటకు వెళ్తుంది. అయితే శరీరంలో నీటి శాతం తక్కువగా అయినప్పుడు దాహం వేస్తుంది. అయితే చలికాలంలో, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీరు బయటకు వెళ్లకుండా కూడా నీటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో దాహం వేయకుండా కూడా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కాలంలో నైనా సరైన నీటిని తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేళ తగినంత నీరు తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే?
ప్రతిరోజు పెద్దవారు రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీటిని తీసుకుంటూ ఉండాలి. ఈ నీరు శరీరంలో లేకపోవడం వల్ల అలసట, బలహీనత ఏర్పడుతుంది. దీంతో శరీర కణాలకు కావాల్సిన నీరు లేకపోవడంతో చిన్న పనికి అలసిపోతుంటారు. మెదడుకు సరిపడా రక్తప్రసరణ జరగకపోవడంతో తలనొప్పి, మైగ్రేషన్ సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి తల తిరుగుతూ ఉంటుంది. శరీరంలో తగినంత నీరు లేకపోవడంతో మలబద్ధకం, గ్యాస్ అసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఉంటుంది. నీరు లేకపోవడం వల్ల మూత్రం పసుపు లేదా ముదురు రంగులో వస్తుంది. ఇలా వస్తుందంటే శరీరం డిహైడ్రేషన్కు గురవుతుందని అర్థం. ఇది ఇలాగే కొనసాగితే కిడ్నీ స్టోన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.
శరీరంలో సరైన నీటి శాతం లేకపోవడంతో చర్మం పొడి మారిపోతుంది. డ్రై గా మారి ముడతలు పడే అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత దద్దుర్లు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏకాగ్రత తగ్గిపోవడానికి శరీరంలో నీరు లేకపోవడం కూడా కారణమే. ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు శ్రద్ధా లేక పోతున్నారంటే శరీరంలో నీటి శాతం లేదని అర్థం. అలాగే రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి కూడా సరైన నీటిని తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు పెద్దలు రెండు నుంచి మూడు లీటర్ల వరకు అంటే ఎనిమి నుంచి పది గ్లాసుల వరకు నీటిని తాగడం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారు మరింతగా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శారీరక శ్రమ లేనివారు నిర్ణీత సమయం ఆధారంగా నీటిని తీసుకోవాలి. చిన్నపిల్లలకు సైతం తగిన నీరు తాగిస్తూ ఉండాలి. వారిలో నీటి శాతం తక్కువగా అయితే కడుపునొప్పి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.