Food Packets : ఉదయాన్నే బ్రాండెడ్ కంపెనీ పేస్టుతో దంతాలు శుభ్రపరచుకుంటాం. ప్యాకేజ్డ్ కవర్లోని పిండితో ఇడ్లీలు వేసుకుంటాం. ప్యాకేజ్డ్ చిప్స్ తింటాం. కూల్ డ్రింక్ తాగుతాం. ఇంకా చాలా చేస్తాం. వాటిని వాడే ముందు.. అందులో ఎటువంటి పదార్థాలు ఉపయోగించారో ఎప్పుడైనా తెలుసుకున్నారా? పోనీ వాటి వల్ల ఏవైనా అనర్ధాలు ఒనగూరుతాయో పరిశీలించారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం నో అయితే.. ఈ కథనం మీకోసమే.. వాస్తవానికి మనం వాడే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఆహార పదార్థాల వరకు ఆగ్ మార్క్ సంస్థ పరిశీలిస్తుంది. అందులో వాడిన పదార్థాల ఆధారంగా లేబులింగ్ ఇస్తుంది. ఇంతకీ ఆ లేబులింగ్ ఎలా ఉంటుందంటే..
దీర్ఘ చతురస్రాకార డబ్బాలో.. ఆకుపచ్చని వృత్తం
మీరు ఏదైనా ఆహార ప్యాకెట్ తీసుకుంటే.. దాని పై భాగంలో దీర్ఘ చతురస్రాకార డబ్బాలో.. ఆకుపచ్చని వృత్తం ఉంటే అది శాఖాహార సంబంధమైన ఉత్పత్తి అని అర్థం. ఇక మాంసాహారంతో తయారుచేసిన ఆహార ఉత్పత్తి అయితే.. దాని ప్యాకెట్ పై దీర్ఘ చతురస్రాకార డబ్బాలో.. బ్రౌన్ కలర్ వృత్తం ఉంటుంది. ఈ రంగును అంతగా గుర్తు పట్టలేక పోతున్నామని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో దానిని బ్రౌన్ కలర్ లోని ట్రయాంగిల్ కు మార్చారు. దీనివల్ల మనం తినబోతున్న ఆహారంలో ఎంతో కొంత మాంసం కలిపారు అని అర్థం. లేదా మాంసంతో తయారు చేశారని అర్థం.
ఒకవేళ ఆహార ప్యాకెట్ పై “g” తిరగబడి, నీలిరంగులో ఉంటే అందులో గ్లూటెన్ లేదని అర్థం. ఆగ్ మార్క్ గుర్తు ఉంటే.. ఆ ఆహార పదార్ధం ఎటువంటి కల్తికి గురి కాలేదని, నూటికి నూరు శాతం స్వచ్ఛమైనదని అర్థం. వేగాన్(vegan) అనే లోగో ఉంటే అందులో ఎటువంటి జంతు సంబంధిత పదార్థాలు వాడలేదని అర్థం.. పర్సనల్ కేర్ ఉత్పత్తులకు సంబంధించిన ప్యాకెట్లపై బ్లాక్ లేదా రెడ్ కలర్ మార్క్ ఉంటే.. వాటి తయారీలో ఎంతో కొంత కెమికల్ వాడారని అర్థం. కెమికల్ స్థాయిని బట్టి అవి ఆరోగ్యానికి మంచివా? కాదా? అని మనమే నిర్ణయించుకోవాలి. ఇక బ్లూ కలర్ మార్క్ ఉంటే అది మెడిసిన్ కు సంబంధించినదని గుర్తుపెట్టుకోవాలి.
ప్రత్యేకంగా ఆహార ఉత్పత్తులపై ఈ గుర్తులు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే.. ఆహారం నిల్వ ఉండేందుకు ఎంతో కొంత కెమికల్స్ లేదా ఇతర పదార్థాలు వాడతారు. రుచికోసం, నాణ్యతను పెంచేందుకు, తాజాగా ఉండేందుకు కొన్ని కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఎంత స్థాయిలో ఉపయోగించారో చెప్పేందుకేన్ ఆ గుర్తులు ఆహార ప్యాకెట్లపై ముద్రిస్తారు. అయితే అవి ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది? కాదు? అనేది మనం ఉపయోగించే తీరును బట్టి ఉంటుంది.