Husband And Wife Relation: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. భార్యాభర్తల బంధం గురించి ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. భార్యాభర్తల బంధం గురించి ఆచార్య చాణక్యుడు పలు విషయాలు వివరించారు. వారిలో దాపరికం ఉండకూడదని సూచిస్తున్నారు. చిన్న విషయం కూడా దాచకుండా భార్యతో పంచుకోవడంతోనే ఇద్దరి మధ్య సంబంధం పెనవేసుకుపోతోందని చెబుతున్నారు. నీతిశాస్త్రంలో ఆలుమగల గురించి అనేక విషయాలు చెప్పారు. భార్యాభర్తలు తమ రహస్యాలను జీవితభాగస్వామితో పంచుకోవడం అంత మంచిదికాదని చెబుతోంది. ఎందుకంటే మన రహస్యాలను జీవిత భాగస్వామితో చెబితే భవిష్యత్ లో మనల్ని చులకన చేసి చూస్తుంది. దీంతో మనలో ఉన్న రహస్యాలను మనలోనే ఉంచుకుంటేనే శ్రేయస్కరం.
మన వివాహ వ్యవస్థ గురించి పాశ్చాత్యదేశాలు ఆసక్తి చూపిస్తాయి. మన ఆచార సంప్రదాయాలను గౌరవిస్తాయి. దీంతో మనదేశంలోని పెళ్లి ని అందరు ఇష్టపడుతున్నా మన వారు మాత్రం లెక్క చేయడం లేదు. దీంతో ఇటీవల విడాకుల సంఖ్య పెరుగుతోంది. వివాహ బంధం పవిత్రమైనదిగా భావిస్తే ఎలాంటి నష్టం ఉండదు. ఏదో ఏమరుపాటుగా వ్యవహరిస్తే అంతే సంగతి. వివాహ వ్యవస్థను మనం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి.
Also Read: Southwest Monsoon: వచ్చే వచ్చే వానజల్లు.. కేరళను తాకిన రుతుపవనాలు!
భార్యాభర్తల మధ్య అసత్యాలకు తావుండకూడదు. ఎలాంటి విషయంలోనైనా జీవితభాగస్వామితో నిజాలే వివరించాలి. ఒకవేళ అది అబద్ధమని తేలితే గొడవలు చోటుచేసుకుంటాయి. అది ఎంత వరకు వెళ్తుందో తెలియదు. అంతే కానీ భార్యాభర్తల మధ్య అగాధం పెరుగుతుంది. అందుకే భార్యాభర్తల మధ్య ఎలాంటి అసత్యాలకు చోటు ఉండకూడదు. మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఇక సంసారం కకావికలం కావడం ఖాయం. అందుకే భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు వచ్చినా ఇద్దరే పరిష్కరించుకోవాలి. ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
భార్యాభర్తల మధ్య అనవసర కోపాలకు కూడా చోటు ఉండకూడదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో నష్టాలే ఎక్కువ. అందుకే కోపానికి రాకుండా ప్రశాంతంగా సమస్యను విని సావధానంగా పరిష్కరించుకోవాలి. అంతేకాని ఏదో ఆధిపత్యం కోసం వెళితే దాంపత్య జీవితానికి చేటు కలుగుతుంది. అందుకే మనం జాగ్రత్తగా మసలుకుంటే మంచిది. తన కోపమే తన శత్రువు అన్నారు. అందుకే ఆలుమగలు కోపాలకు దూరంగా ఉండి అన్యోన్యమైన సంసారంతో అందరిని మెప్పించాలి.
వివాహ వ్యవస్థ పటిష్టత కోసం పలు కోర్టులు కూడా సహకరిస్తున్నాయి. హిందూ వివాహ చట్టంలో ఆలుమగల కోసం కొన్ని సెక్షన్లు కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు వారి భవిష్యత్ ను నందనవనంగా చేసుకోవడానికి మార్గాలు చూసుకోవాలి. దీంతో సంసారమనే నావ సవ్యంగా సాగాలంటే నమ్మకమనే తెడ్డు ఉండాలి. అపార్థాలకు తావు లేకుండా అబద్దాలకు చోటు లేకుండా చేసుకుంటే జీవితం ఓ పూల పానుపు కానుంది. తద్వారా మన వ్యవస్థను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన ఆచార సంప్రదాయాలను గౌరవించి ఉన్నతమైన ఆలోచనలతో ఉత్తమంగా ఎదగాలని నిరంతరం ఆశిద్దాం.
Also Read:AVATAR 2: THE WAY OF WATER Trailer: అవతార్.. ఈసారి నీటి కోసం ఈ యుద్ధం? అద్భుతం
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: What can be done to strengthen the bond between husband and wife
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com