
నలుగురితో పాటు నారాయణ, కులముతో పాటు గోవిందా.. అనకుండా కాంగ్రెస్ తరఫున గ్రేటర్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. టిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ను తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: బండి సంజయ్‌ని హైకమాండ్ కంట్రోల్ చేసిందా..?
కేసిఆర్, కేటీఆర్ వ్యవహారాలపైన వ్యక్తిగతంగానూ పోరాడుతూ, వారి ఇమేజ్ ను ప్రజలు డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నిస్తూ, కాంగ్రెస్ కు మళ్ళీ పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పార్టీ కోసం రేవంత్ ఎంత కష్టపడుతున్నా, మిగతా నాయకుల తీరు కారణంగా ఆ శ్రమంతా వృథా అవుతున్నట్లు కనిపిస్తోందని రేవంత్ సన్నిహితులు వాపోతున్నారట. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం కలుగజేసుకొని పార్టీలోని గ్రూపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, పార్టీ కీలక నాయకులతో సమావేశం నిర్వహిస్తే తప్ప ఆ పార్టీకి మళ్లీ పునర్వైభవం వచ్చే అవకాశమే కనిపించడం లేదు.
Also Read: బండి సంజయ్ నన్ను మోసం చేశాడు: రాజాసింగ్ సంచలన ఆడియో లీక్
కార్యకర్తలు, అభ్యర్థులకు ఎక్కడ కష్టం వచ్చినా రేవంత్ రెడ్డి వాలిపోతున్నారు. అప్పటికప్పుడు న్యాయపోరాటానికి సాయం చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని చెప్పేందుకు రేవంత్ తనదైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ తరపున టీఆర్ఎస్‌పై పోరాడేందుకు.. చార్జ్ షీట్ పేరుతో.. ఓ నివేదికను విడుదల చేసేందుకు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చారు. కేంద్రం నిధులను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ఆయన చార్జ్‌షీట్‌ను విడుదల చేసి విమర్శించారు.
టీఆర్ఎస్‌తో లాలూచీ లేకపోతే… బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదులపై కూడా ఎందుకు స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందులో మొదటిగా.. నిజామాబాద్ ఎంపీ అరవింద్.. మైహోం గ్రూప్ కంపెనీలపై చేసిన అక్రమ మైనింగ్ ఫిర్యాదును ప్రస్తావించారు. ఓ వైపు.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల్ని ఎదుర్కొంటూనే మరో వైపు పార్టీ అభ్యర్థులకు అండగా ఉండేందుకు పరుగులు పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించారని తెలియగానే అక్కడికి వెళ్లారు. ఓ వైపు హైకోర్టులో పిటిషన్ వేయించారు. అధికారులు ఎలాగూ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరిస్తారని న్యాయపోరాటం చేశారు. స్టే తీసుకు వచ్చారు.
ఒక రకంగా చెప్పాలంటే మిగతా కాంగ్రెస్ నాయకులతో పోల్చుకుంటే, గట్టిగానే పార్టీకోసం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. రేవంత్ దూకుడు చర్యలతో పార్టీలో కాస్త ఉత్సాహం వచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే రేవంత్ తపనను సొంత పార్టీ నేతలే అర్థం చేసుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.