https://oktelugu.com/

Chicken: చికెన్, పెరుగును మిక్స్ చేస్తున్నారా? అయితే మీ సంగతి అంతే..

చికెన్ పేరు వినగానే మాంసాహార ప్రియులకు నాలుక లపలపలాడుతుంటుంది కదా. చికెన్ కర్రీ, చికెన్‌ ఫ్రై, తందూరీ చికెన్‌ ఇలా రకరకాల వంటలు నోరు ఊరిస్తుంటాయి. ఇలాంటి చికెన్‌ ప్రియులకు ఆరోగ్య నిపుణులు ఓ సూచన చేస్తున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 31, 2024 / 06:20 AM IST

    Chicken

    Follow us on

    Chicken: చికెన్, చికెన్, చికెన్ ఎక్కడ చూసిన ఎవరిని చూసినా ఫుల్ గా లాగేస్తున్నారు. చికెన్ అంటే చాలా మందికి పిచ్చి గా మారింది. చికెన్ తినడం వల్ల నష్టాలు ఉన్నాయి, ప్రాణహానీ అని చెప్పినా కూడా వినరు కావచ్చు కదా. అది మరి చికెన్ రేంజ్ అంటే.. మరీ మీరు అనుకునేట్టుగా ప్రాణహానీ ఏం లేదు. ఉదాహరణగా మాట్లాడుకున్నాం. అయితే చికెన్ అంటే మీకు ఇష్టం. అందులో పెరుగు వేసి వండితే మరింత ఎక్కువ ఇష్టమా? చికెన్ తిన్న తర్వాత పెరుగుతో తినడం కూడా ఇష్టమా? అసలు ఈ చికెన్ పెరుగు కాంబినేషన్ మంచిదే అంటారా? మరి ఈ విషయంలో నిపుణులు ఏం అంటున్నారో ఓ సారి చూసేద్దాం.

    చికెన్ పేరు వినగానే మాంసాహార ప్రియులకు నాలుక లపలపలాడుతుంటుంది కదా. చికెన్ కర్రీ, చికెన్‌ ఫ్రై, తందూరీ చికెన్‌ ఇలా రకరకాల వంటలు నోరు ఊరిస్తుంటాయి. ఇలాంటి చికెన్‌ ప్రియులకు ఆరోగ్య నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. అదేంటంటే.. చికెన్ కర్రీని అన్నంలో తినడం అంటే చాలా మందికి ఇష్టమే. అదే ఎక్కువగా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక చికెన్ తో తిన్న తర్వాత చివర్లో పెరుగు తింటారు. ఇలా తినడం అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
    ముఖ్యంగా చికెన్‌ని పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయట. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    చాలా మంది పెరుగు వేసి చికెన్‌ వండుతుంటారు. చికెన్‌ తిన్న తర్వాత పెరుగు తింటుంటారు. ఇలాంటి అలవాట్లు ఉంటే కచ్చితంగా మానుకోవాలి అంటున్నారు నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, చికెన్‌తో పాటు పెరుగును కలపడం వల్ల మాత్రం నష్టమే ఎక్కువ ఉంది అంటున్నారు నిపుణులు. చికెన్‌ వల్ల శరీరంపై వేడి ప్రభావం ఉంటే.. పెరుగు వల్ల చల్లని ప్రభావం ఉంటుంది. ఈ రెండింటి ఎఫెక్ట్.. జీర్ణ వ్యవస్థపై పడుతాయి. ఈ ప్రభావం చెడుగా ఉంటుంది కాబట్టి వీటిని మిక్స్ అసలు చేయవద్దు అంటున్నారు నిపుణులు.

    మరికొందరికి చికెన్‌ తిన్న తర్వాత పాలు తాగే అలవాటు కూడా ఉంటుంది. అలవాటు లేకున్నా చికెన్ తిన్న తర్వాత పాలు ఎట్టిపరిస్థితుల్లో కూడా తాగవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరికి రాత్రి భోజనం తర్వాత పాలు తాగి పడుకోవడం అలవాటు ఉండటం కామన్. అయితే చికెన్‌ తిన్న రోజు పాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి కాబట్టి చికెన్ తిన్న తర్వాత పాలను కూడా స్కిప్ చేసేయండి బెటర్.

    చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చికెన్ ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. మూడు ఔన్సుల వండిన చికెన్ బ్రెస్ట్‌లో 27 గ్రాముల ప్రొటీన్ ఉంటుందట. రోజూ ప్రోటీన్ అవసరమయ్యే వారికి చికెన్‌ అద్భుతమైన ఆహారం. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫిట్‌నెస్ ఔత్సాహికులు, ఆరోగ్యం గురించి ఇంట్రెస్ట్ తీసుకునేవారు చికెన్ ను ఎక్కువ తీసుకుంటుంటారు.