https://oktelugu.com/

చలికాలంలో వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?

నిత్యం వంటకాలలో వినియోగించే వాటిలో వెల్లుల్లి ఒకటనే సంగతి తెలిసిందే. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో వెల్లుల్లి ఎంతగానో తోడ్పడుతుంది. చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అల్లిసిన్, మాంగనీస్, విటమిన్ బీ6, విటమిన్ సీ, సెలినీయం, ఫైబర్, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లి రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2021 / 08:54 AM IST
    Follow us on

    నిత్యం వంటకాలలో వినియోగించే వాటిలో వెల్లుల్లి ఒకటనే సంగతి తెలిసిందే. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో వెల్లుల్లి ఎంతగానో తోడ్పడుతుంది. చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అల్లిసిన్, మాంగనీస్, విటమిన్ బీ6, విటమిన్ సీ, సెలినీయం, ఫైబర్, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

    వెల్లుల్లి రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎవరైతే వెల్లుల్లిని తీసుకుంటారో 63 శాతం మందికి జలుబు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంతో పాటు వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ రక్తపోటులో సానుకూల ప్రభావం చూపించడంలో తోడ్పడతాయి. వెల్లుల్లి బరువును తగ్గించడంతో పాటు వెల్లుల్లిలో పోషకాలు, కేలరీలు తక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే.

    వెల్లుల్లిలో తేనె కలిపి తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందనే విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. వెల్లుల్లి స్త్రీల శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎముకలు దెబ్బతినకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల దంతక్షయంకు చెక్ పెట్టవచ్చు.

    వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉదయాన్నే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అల్జీమర్స్ వ్యాధిని దూరం చేయడంలో వెల్లుల్లి తోడ్పడుతుంది. పరగడుపున రోజూ వెలుల్లిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.