https://oktelugu.com/

Beer  : దేశంలో అత్యధికంగా అమ్ముడు పోయే ఈ బీర్లు ఏంటి? ఎందుకంత స్పెషల్.? అల్కహాల్ శాతం ఎంత ఉంటుంది?

బీర్లు అనగానే కొందరు లొట్టలేస్తారు. చిన్న పాటి పార్టి నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్లలో బీర్లు కచ్చితంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల బీర్లు ఉన్నాయి. ఇందులో 7.5 శాతం అల్కహాల్ ఉన్నవి, 5 శాతం, 4.5 శాతం అల్కహాల్ ఉన్నవి అందుబాటులో ఉన్నాయి. కొందరు ఎక్కువ కిక్ కోసం ఎక్కవ ఆల్కహాల్ శాతం ఉన్న బీర్లను ఇష్టపడుతారు. మరికొందరు సాప్ట్ గా ఉండాలని తక్కువ మోతాదులో ఉన్న దానిని తీసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 14, 2024 / 11:28 AM IST

    Best Selling Beers

    Follow us on

    Beer  :  నిత్యం ఉరుకులు.. పరుగుల జీవితం.. ఉదయం నుంచి రాత్రి వరకు విధులతో బిజీ వాతావరణం.. ఈ సమయంలో సాయంత్రం కాస్త రిలాక్స్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు.ఈ క్రమంలో కొందరు సినిమాలు చూస్తుంటారు.మరికొందరు స్నేహితులను కలుస్తారు. ఇంకొందరు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. కానీ ఎవరూ లేని ఒంటరిగా ఉన్న వారికి స్నేహహస్తంలా ఉంటుంది అల్కహాల్. అందుకే సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా.. ముందుగా అల్కహాల్ వద్దే వస్తారు. ఈ నేపథ్యంలో చాలా వరకు బార్లు, మద్యం దుకాణాలు మద్యం బాబులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఎక్కువ మంది రెడ్ వైన్ కంటే బీర్లు స్విప్ చేయడానికి లైక్ చేస్తారు. ఇవి చాలా కూల్ గా ఉండడంతో పాటు టేస్టీగా ఉంటాయి. ఇక వేసవి కాలంలో అయితే బీర్లు అత్యధికంగా అమ్ముడు పోతుంటాయి. అయితే మన దేశంలో ఎక్కువగా ఏ బీర్లు తాగుతారో తెలుసా? అందులో అమ్మకాల్లో టాప్ 5 లో ఉన్న బీర్లు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి..

    బీర్లు అనగానే కొందరు లొట్టలేస్తారు. చిన్న పాటి పార్టి నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్లలో బీర్లు కచ్చితంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల బీర్లు ఉన్నాయి. ఇందులో 7.5 శాతం అల్కహాల్ ఉన్నవి, 5 శాతం, 4.5 శాతం అల్కహాల్ ఉన్నవి అందుబాటులో ఉన్నాయి. కొందరు ఎక్కువ కిక్ కోసం ఎక్కవ ఆల్కహాల్ శాతం ఉన్న బీర్లను ఇష్టపడుతారు. మరికొందరు సాప్ట్ గా ఉండాలని తక్కువ మోతాదులో ఉన్న దానిని తీసుకుంటారు. వీటిలో ఏ బీరులో ఎంత ఆల్కహాల్ శాతం ఉంతో తెలుసుకుందాం..

    కింగ్ ఫిషర్:
    గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రతీచోట లభించే బీరు కింగ్ ఫిషర్. యూనైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ కంపెనీ నుంచి వచ్చిన ఈ బీరును బెంగుళూర్ లో తయారు చేస్తారు. దీనిని 1978లో విజయ్ మాల్య ప్రారంభించారు. దేశంలో అత్యధికంగా అంటే 41 శాతం వరకు అమ్ముడు పోయే బీర్ ఇది. ఇందులో అల్కహాల్ 4.8 శాతం ఉంటుంది. ఇవి లైట్, స్ట్రాంగ్ అని రెండు విధాలుగా విక్రయిస్తారు.

    హైవర్డ్స్ 5000:
    గ్రామాల్లో ఎక్కువగా విక్రయాలు జరుపుకునే బీరు ఇది. సాబ్ మిల్లర్ అనే కంపెనీ దీనిని తయారు చేస్తుంది. ఇది బీర్ల అమ్మకాల్లో దేశంలో 2వ స్థానం అంటే 15 శాతం విక్రయాలు జరుపుకుంటుంది. ఇందులో అల్కహాల్ 7 శాతంగా ఉంటుంది. కింగ్ ఫిషర్ బీర్ కంటే ఇందులో ఎక్కువ ఆల్కహాల్ శాతం ఉన్నా కొందరు ఎక్కువ కిక్ కోసం తీసుకుంటూ ఉంటారు.

    నాకౌట్:
    సాబ్ మిల్లర్ కంపెనీ నుంచి విక్రయించే మరో బీర్ నాకౌట్. బాక్సింగ్ క్రీడలో పేర్కొనే నాకౌట్ పేరుతో ఉన్న ఈ బీరు అలాగే మంచి కిక్ ఇస్తుంది. ఇందులో అల్కహాల్ శాతం 8 శాతం ఉంటుది. దేశంలో అత్యధికగా అమ్ముడు పోయే బీర్లలో ఇది మూడో స్థానాన్ని కలిగి ఉంటుంది.

    బ్లాక్ లేబుల్:
    యూనైటడ్ బ్రేవరీస్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయ్యే మరో బీరు బ్లాక్ లేబుల్. ఇది పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటుంది. తూర్పు రాష్ట్రాల్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కల్యాణి బ్లాక్ లేబుల్ గా పేర్కొంటున్న ఈ బీరు దేశంలోని అమ్మకాల్లో 4 వ స్థానంలో ఉంది. ఇందులో 7.8 శాతం అల్కహాల్ శాతం ఉంటుది.

    బడ్ వైజర్:
    బీర్ తాగాలని అనిపించినా తక్కువ మోతాదులో అల్కహాల్ పర్సంటేజ్ ఉన్న బీర్లు కావాలనుకునే వారికి బడ్ వైజర్ మంచి బీరుగా ఉంటుంది. ఇందులో 5 శాతం కంటే తక్కువగానే అల్కహాల్ ఉంటుంది. దేశంలో బీర్ల అమ్మకాల్లో ఇది 5వ స్థానంలో ఉంది.