https://oktelugu.com/

Janhvi Kapoor : ఎన్టీఆర్ కోసం ఆ స్టార్ హీరోని పక్కన పెట్టిన జాన్వీ కపూర్… ఈ నిర్ణయం వెనుక ఆ బడా నిర్మాత హస్తం!

జాన్వీ కపూర్ ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ దేవర విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్ మరో స్టార్ హీరోకి హ్యాండ్ ఇచ్చిందట. ఆమె నిర్ణయం వెనుక ఓ బడా ప్రొడ్యూసర్ ఉన్నాడట. ఇంతకీ ఎవరా ప్రొడ్యూసర్?

Written By:
  • S Reddy
  • , Updated On : September 14, 2024 / 11:10 AM IST

    Janhvi Kapoor

    Follow us on

    Janhvi Kapoor : శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పరిశ్రమలో అడుగుపెట్టి ఐదేళ్లు దాటిపోయింది. స్టార్డం మాత్రం రాలేదు. చెప్పాలంటే ఆమె ఖాతాలో ఒక్క భారీ హిట్ లేదు. అలాగే స్టార్ హీరోలతో నటించలేదు. దర్శకుడు కొరటాల శివ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి జంటగా దేవర మూవీ హీరోయిన్ గా ఎంపిక చేశాడు. దేవర సెప్టెంబర్ 27న విడుదల కానుంది. శ్రీదేవి కూతురు, సీనియర్ ఎన్టీఆర్ మనవడు జతకడుతున్న దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి.

    కాగా దేవర మూవీ కోసం జాన్వీ కపూర్ మరో స్టార్ హీరోకి హ్యాండ్ ఇచ్చిందట. విషయంలోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో జాన్వీ కపూర్ కి ఛాన్స్ వచ్చిందట. అదే సమయంలో దేవర ఆఫర్ కూడా ఆమె తలుపు తట్టిందట. ఎన్టీఆర్-విజయ్ లలో ఎవరి సినిమాకు సైన్ చేయాలనే సందిగ్ధత ఆమెలో నెలకొందట. ఈ క్రమంలో తనకు సన్నిహితుడైన నిర్మాత కరణ్ జోహార్ ని జాన్వీ కపూర్ సంప్రదించిందట. ఎన్టీఆర్, విజయ్ లలో ఎవరితో మూవీ చేస్తే బెటర్ అని అడిగిందట.

    అప్పుడు కరణ్ జోహార్ ఎన్టీఆర్ మూవీని ఎంచుకో అని సలహా ఇచ్చాడట. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్. టాలెంట్ ఉన్న హీరో. విజయ్ కూడా స్టార్ అయినప్పటికీ ఎన్టీఆర్ తో చేయడం నీ కెరీర్ కి ప్లస్ అవుతుందని సూచించాడట. కరణ్ జోహార్ సలహా మేరకు విజయ్ మూవీని రద్దు చేసుకున్న జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మూవీకి సైన్ చేసిందట. మరి ఏరి కోరి ఎన్టీఆర్ ని ఎంచుకున్న జాన్వీ కపూర్ కి దేవర ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

    కాగా దేవర విడుదలకు ముందే జాన్వీ కపూర్ మరో బడా స్టార్ చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ 16వ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం అని సమాచారం. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్ ఆర్ ఆర్ హీరోలతో జాన్వీ నటించనుంది. కాగా దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది.