Black coffee : ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగకపోతే కొందరికి రోజు కూడా గడవదు. ఎవరికైనా సూర్యోదయంతో డే స్టార్ట్ అవుతుందని కానీ కొందమందికి కాఫీతో రోజు ప్రారంభమవుతుంది. పొద్దునే రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. పాలు, పంచదార లేకుండా ఈ కాఫీని తయారు చేస్తారు. రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా.
రోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో సగం ఆరోగ్య సమస్యలు మాయమైపోతాయి. బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ కాఫీ తాగే 21 వేల మందిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. బ్లాక్ కాఫీ తాగని వారికంటే తాగేవారిలో సగం సమస్యలను తగ్గించవచ్చని తేలింది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఇవి గుండె ఆగిపోయే సమస్యను తగ్గించడంలో సాయపడుతుంది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ గుండెకు అంతమంచిది కాదని చాలామంది భావిస్తారు. కానీ మితంగా తాగితే కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో పంచదార ఉండదు. కాబట్టి ఈ కాఫీ తాగడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా నశించిపోవడంతో పాటు దంత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తపోటుకూడా అదుపులో ఉంటుంది.
ప్రతిరోజు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం మంచిదే. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 13 శాతం తగ్గుతుందట. అలాగే మధుమేహం, కాలేయం, రొమ్ము, పేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను బ్లాక్ కాఫీ తగ్గిస్తుంది. దీనిని తాగడం వల్ల తక్షణమే శక్తి లభించడం, బరువు తగ్గడం, ఆయుష్షు పెరగడం, డిప్రెషన్‌కు గురి కాకుండా యాక్టివ్‌గా ఉంటారు. ఇందులోని కెఫిన్ డోపమైన, నోర్‌పైన్ ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో సంతోషంగా ఉండటంతో పాటు ఒత్తిడి, అలసట, నీరసం నుంచి విముక్తి పొందుతారు. బ్లాక్ కాఫీ వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. తద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇందులోని కెఫిన్ శరీరంలోని కణజాలాల చుట్టూ యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. బ్లాక్ కాఫీని అధికంగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే అధికస్థాయిలో ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఆందోళనకు దారితీస్తాయి. సాధారణంగా బ్లాక్ కాఫీ తాగితేనే కొందరికి నిద్రపట్టదు. అలాంటిది అధికంగా తీసుకుంటే నిద్ర విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు కాఫీ తాగకపోవడం బెటర్. అలాగే కడుపులో కెఫిన్ ఎక్కువగా అయిపోవడం వల్ల ఆమ్లతత్వానికి దారితీసి.. తిమ్మిర్లు, పొత్తికడుపులో నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకి అధికంగా కాకుండా మితంగా మాత్రమే బ్లాక్ కాఫీ తాగండి.
Web Title: What are the benefits of drinking black coffee daily
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com