sorghum bread : వామ్మో జొన్న రొట్టె వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

జొన్నలు ఒక పౌష్టిక ధాన్యం. జొన్న రొట్టెలు తెలుగునాట సంప్రదాయ ఆహార పదార్థం. ఇది పూర్వకాలం నుంచి మన ఆహారంలో ముఖ్యమైన భాగం అవుతుంది. జొన్నలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందిస్తాయి. జొన్న రొట్టెలు రోజూ తినడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే?

Written By: Swathi Chilukuri, Updated On : October 22, 2024 1:51 pm

Whammo sorghum bread has so many benefits?

Follow us on

sorghum bread : జొన్న రొట్టెలు అధిక పౌష్టిక విలువలను కలిగి ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. దీంతో శరీరానికి ఇంధనం అందిస్తాయి. శక్తిని నిలుపుకొంటాయి. రోజూ ఉదయాన్నే జొన్న రొట్టెలు తినడం వలన శరీరానికి అవసరమైన శక్తిని అందుతుంది. చురుకుదనాన్ని కలిగిస్తాయి రొట్టెలు.

జొన్నలలో అధికంగా ఉండే డైట్‌ ఫైబర్ జీర్ణవ్యవస్థను క్రమబద్ధంగా ఉంచడంలో సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు.. ఇది మలబద్ధకం సమస్యలను తగ్గించి, పేగు సంరక్షణకు సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగు అవుతుంది. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. వీటిలో ఉండే పీచు (ఫైబర్), ప్రోటీన్ వలన, ఆకలి త్వరగా వేయదు. అంటే చాలా సేపు కూడా కడుపు నిండిన భావన ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ తగ్గించి, అనవసరమైన కేలరీలను కూడా తగ్గించి బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది జొన్న రొట్టె. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మేలు. జొన్న రొట్టెలు తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, మధుమేహం రాకుండా చూసుకోవచ్చు.  జొన్న రొట్టెలు హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పడుతుంది. హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జొన్న రొట్టెలు తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. రక్తహీనతను తగ్గిస్తుంది జొన్నలు అధికంగా విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం,  ఇనుము, విటమిన్ B వంటి విటమిన్లు జొన్నె రొట్టెలో లభిస్తాయి. ఇవి శరీరంలో రక్తహీనతను (అనీమియా) తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

జొన్నల్లో ఉన్న మెగ్నీషియం, కాల్షియం శరీరానికి చాలా అవసరం. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఎముకల సంబంధిత వ్యాధులు, నాజూకుతనం సమస్యలను తగ్గింస్తుంది జొన్న రొట్టెలు. దీన్ని రోజూ తింటే ఎముకలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులకు చాలా మేలు. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన, ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. జొన్నలలో పొలీఫినాల్స్ అనే పదార్థం ఉండి, ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను తగ్గిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్ శరీరానికి హాని చేస్తాయి. అందుకే జొన్నలు తీసుకోవడం వలన ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం జొన్నల్లో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది శరీరంలో వ్యాధి కారకులను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.