https://oktelugu.com/

ఏలూరులో మళ్లీ వచ్చిన వింత వ్యాధి.. బాధితుల సంఖ్య ఎంతంటే..?

  కొన్ని రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరును వింత వ్యాధి గజగజా వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలోని భీమడోలు మండలంలొని పూళ్ల అనే గ్రామంలో వింతవ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ 20 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. Also Read: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలా..? ఈ నెల 16వ తేదీన గ్రామంలో ఇద్దరు అస్వస్థతకు లోనై […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2021 / 01:06 PM IST
    Follow us on

     

    కొన్ని రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరును వింత వ్యాధి గజగజా వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలోని భీమడోలు మండలంలొని పూళ్ల అనే గ్రామంలో వింతవ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ 20 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

    Also Read: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలా..?

    ఈ నెల 16వ తేదీన గ్రామంలో ఇద్దరు అస్వస్థతకు లోనై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత వింత వ్యాధి బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. నడుస్తూ కింద పడిపోవడం, మూర్చ లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఈ వ్యాధి వింత వ్యాధేనని నిర్ధారణకు వస్తున్నారు. అధికారులు ఇప్పటికే అప్రమత్తమై ఐదు వైద్య బృందాలను గ్రామంలో ఏర్పాటు చేశారు.

    Also Read: మధుమేహాన్ని వేగంగా తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..?

    అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయడంతో పాటు నీళ్ల ట్యాంక్ లలోని వాటర్ శాంపిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈరోజు మంత్రి ఆళ్లనాని వింత వ్యాధి బారిన పడిన వారిని పరామర్శించనున్నారు. బాధితులు ప్రస్తుతం ప్రత్యేక చికిత్స పొందుతుండగా అందరూ కోలుకున్నారని తెలుస్తోంది. అధికారులు ప్రజలు భయాందోళనకు గురి కావద్దని కీలక సూచనలు చేస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    వైద్య అధికారులు బాధితులకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఏలూరులోని జిల్లా కేంద్రాసుపత్రికి వారిని పంపించారు. ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధికి కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.