‘ఆర్నాబ్’ వాట్సాప్ చాట్స్.. వెలుగుచూస్తున్న సంచలన నిజాలు..!

రిపబ్లిక్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి రహస్యాల గుట్టును ముంబై పోలీసులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. టీవీ ఛానళ్లకు రేటింగ్ ఇచ్చే బార్క్ సంస్థ చీఫ్ పార్థోదాస్ గుప్తా.. ఆర్నాబ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలోనే వీరిమధ్య జరిగిన సంభాషణల్లో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Also Read: ‘శ్రీలక్ష్మి’ని అక్కున్న చేర్చుకున్న జగన్ సర్కార్! రిపబ్లిక్ ఛానల్ బాలీవుడ్లో డ్రగ్స్ కేసు.. సుశాంత్ ఆత్మహత్య […]

Written By: NARESH, Updated On : January 19, 2021 5:28 pm
Follow us on

రిపబ్లిక్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి రహస్యాల గుట్టును ముంబై పోలీసులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. టీవీ ఛానళ్లకు రేటింగ్ ఇచ్చే బార్క్ సంస్థ చీఫ్ పార్థోదాస్ గుప్తా.. ఆర్నాబ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలోనే వీరిమధ్య జరిగిన సంభాషణల్లో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: ‘శ్రీలక్ష్మి’ని అక్కున్న చేర్చుకున్న జగన్ సర్కార్!

రిపబ్లిక్ ఛానల్ బాలీవుడ్లో డ్రగ్స్ కేసు.. సుశాంత్ ఆత్మహత్య కేసులోని ఎన్నో సంచలన విషయాలను బయటికి తీసుకొచ్చింది. బాలీవుడ్లోని చీకటి కోణాలను సైతం వెలుగులోకి తీసుకొచ్చి టీఆర్పీలో దూసుకెళ్లింది. అయితే టీఆర్పీలో అక్రమాలు జరిగాయని పలువురు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

ఈక్రమంలోనే ముంబై పోలీసులు బార్క్ సంస్థ చీఫ్ పార్థోదాస్ గుప్తాతో ఆర్నాబ్ వాట్సాప్ లో చేసిన ఛాట్ ను సేకరించారు. ఈ సంభాషణలో పార్థోదాస్ నిజమైన చానల్స్ రేటింగ్ బదులుగా ఆర్నాబ్ చెప్పినట్లుగా ఆయా ఛానళ్లకు టీఆర్పీ ఇచ్చినట్లుగా కన్పిస్తోంది. అయితే వీరిమధ్య దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు సైతం చర్చకు రావడం సంచలనంగా మారింది.

Also Read: చరిత్రను మరిచి చిన్న జీయర్‌‌ వ్యాఖ్యలు

భారత సైన్యం బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టడానికి మూడురోజుల ముందే ఆ విషయాన్ని ఆర్నాబ్ గోస్వామి పార్థోదాస్ గుప్తాతో పంచుకున్నారు. ఇంత కీలకమైన విషయం ఆర్నాబ్ కు ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. దేశ రక్షణకు సంబంధించిన విషయాన్ని ఆర్నాబ్ వాట్సాప్ లో చర్చించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగుచూటంతో పార్దోదాస్ గుప్తా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా మీడియా మానిపులేషన్ తో దేశ ప్రజల అభిప్రాయాన్ని ఆర్నాబ్ మార్చడాన్ని ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్