https://oktelugu.com/

Weight Gain: రోజూ పాలు తాగితే బరువు పెరుగుతారా? ఇందులో నిజమెంత?

పాలు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారని కొందరు అంటుంటారు. నిజంగానే పాలు తాగితే బరువు పెరుగుతారా? ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2024 / 02:45 AM IST

    milk

    Follow us on

    Weight Gain: ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది పాలు తాగుతారు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. పాలను చిన్నప్పటి నుంచి తాగుతుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు తప్పకుండా పాలను ఇస్తారు. ఇందులో కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డైలీ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండటం, నిద్రలేమి సమస్యలు తొలగిపోవడం వంటివి కూడా జరుగుతాయి.

     

    రోజూ ఏదో ఒక సమయంలో పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఇందులో ఆరోగ్యమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలను కూడా దరిచేరనియ్యవు. అయితే పాలు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారని కొందరు అంటుంటారు. నిజంగానే పాలు తాగితే బరువు పెరుగుతారా? ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    పాలలో కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో ఆరోగ్యమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువును కూడా పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు పాలు తాగకపోవడమే బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి పోషకాలు బరువు పెరగడానికి బాగా సాయపడతాయి. బాగా సన్నగా ఉన్నవారు రోజూ పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యం, దంతాల దృఢత్వానికి తప్పకుండా పాలు అవసరం. రోజూ పాలు తాగడం వల్ల ప్రమాదకరమైన బోలు ఎముకల వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

     

    పూర్వం రోజుల్లో అయితే ఒక్కో ఇంటికి ఆవు ఉండేది. దీనివల్ల నాణ్యమైన పాలు లభ్యమయ్యేవి. కానీ ఈ రోజుల్లో అసలు ఆవు పాలు దొరకడమే కష్టంగా మారింది. అందరూ కూడా ప్యాకెట్ పాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటిని పౌడర్లు, రసాయనాలు కలిపి తయారు చేస్తున్నారు. ఇలాంటి పాలు తాగడం వల్ల పిల్లలు చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివని చాలా మంది పిల్లలకు ఎక్కువగా ఇస్తుంటారు. ఆఖరికి పుట్టిన పిల్లలకు కూడా ఇలా ప్యాకెట్, పౌడర్ పాలను పడుతున్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు ఇలాంటి పాలు పెట్టడం వల్ల పిల్లలు బలహీనంగా మారిపోతారు. కాబట్టి నాణ్యమైన పాలను పిల్లలకు పెట్టండి. ఈ రోజుల్లో కల్తీ పాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది లాభాల కోసం పాలను కల్తీ చేస్తున్నారు. కాబట్టి ప్యాకెట్ పాల కంటే స్వచ్ఛమైన ఆవు పాలను వాడటం మంచిది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.