Water Side Effects: ఏదైనా అతిగా చేస్తే అంతే సంగతి. అది ఆహారమైనా సరే. నీరైనా కానీ తగిన మోతాదులో తీసుకుంటేనే శ్రేయస్కరం. లేదంటే శరీరానికి అనర్థాలు ఏర్పడే అవకాశాలుంటాయని తెలిసిందే. మనం ప్రతిరోజు ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అది ఆహారంలో , నీరు తీసుకోవడంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. కొందరు కావాలని నీరు కప్పలా తాగుతూనే ఉంటారు. ఇది అంత మంచిది కాదు. ఎందుకంటే మన శరీరానికి కావాల్సినంత నీరే ఇవ్వాలి. ఎక్కువ తీసుకుంటే ప్రమాదకరమే. దీంతో అనేక వ్యాధులు ప్రబలే అవకాశముంది.
రోజుకు మనం కనీసం 15 గ్లాసులు లేదా నాలుగు లీటర్ల నీరు తాగాలి. అది కూడా క్రమపద్ధతిలో తీసుకోవాలి. నీరు తక్కువ తాగితే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఎక్కువ తాగితే ఓవర్ హైడ్రేషన్ తో పాటు డయేరియా ప్రబలే అవకాశముంది. నీరు ఎక్కువ తీసుకుంటే కాళ్లు, చేతులు, పెదాలు వాపు వస్తాయి. నీరు ఎక్కువ తాగితే కండరాలు పట్టేస్తాయి. దీంతో పలు సమస్యలకు మూల కారణమవుతుంది. అందుకే జాగ్రత్త మంచినీరు అదేపనిగా తాగకండి. ఎప్పుడు పడితే అప్పుడు తాగొద్దు.
Also Read: Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?
నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో మినరల్స్ కోల్పోతాం. అందుకే మంచినీరు మితంగా తీసుకుంటేనే మంచిది. ఇది తెలుసుకుంటే ఇంకా మంచిది. కానీ కొందరు చెప్పినా వినరు పట్టించుకోరు. అదే పనిగా తాగుతూనే ఉంటారు. దీంతో అనేక సమస్యలకు మూల కారకులు అవుతారు జాగ్రత్త. నీరు ఎక్కువగా తాగుతూ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తే కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. నీరు మోతాదు పెంచుకోకండి. సమస్యలు తెచ్చుకోవద్దు.
నీరు సరైన సమయానికి సరైన మోతాదులో తాగుతుంటే అరవై శాతం జబ్బులను తగ్గించుకోవచ్చు. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలే. దీన్ని ఎవరు కూడా పట్టించుకోరు. నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తారు. నీరు ఎంత తాగితే అంత మంచిదని తాగుతుంటారు. కానీ తరువాత వచ్చే ఉపద్రవాలను గమనించరు. అలాంటి వారు నీరు ఎక్కువగా తీసుకోకుండా సమయానికి తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
Also Read:Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?