Sleep Deprivation: ఉద్యోగం, వ్యాపారం ఇతర కారణాలవల్ల నేటి కాలంలో చాలామంది రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో నిద్రపోకపోవడంతో.. సరైన సమయంలో నిద్ర లేవకపోవడం వల్ల బరువు పెరగడం, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే మానసికంగా చురుకుదనం తగ్గుతుంది. దీంతో రోజంతా అలసట ఏర్పడుతుంది. అయితే నిద్ర గడియారాన్ని సరైన విధంగా సెట్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రత్యేకంగా స్లీప్ సైకిల్ ను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ స్లీప్ సైకిల్ ఎలా ఉంటుందంటే?
రకరకాల కారణాలవల్ల రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే ఉదయం ఆలస్యంగా నిద్రలేచినా కూడా సూర్య రశ్మి వెలుగులోకి ఒకసారి వెళ్లి రావడం చాలా మంచిది. ఎందుకంటే అప్పటివరకు కళ్ళు మూసుకొని ఉంటారు. అలాగే చల్లటి వాతావరణం లో ఉండగలుగుతారు. ఉదయమే సూర్య రష్మి వెలుగులోకి వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శారీరకంగానూ, మానసికంగాను ఉత్సాహం కలుగుతుంది. కానీ కొన్ని ఏరియాలో సూర్యరష్మి వెలుగు ఉండకపోవచ్చు. ఇలాంటివారు ప్రత్యేకంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
అంతేకాకుండా ప్రతిరోజు ఒక ప్రణాళిక ప్రకారం గా నిద్ర పోవడం.. నిద్ర లేవడం వంటివి ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి.. ఉదయం ఒకే సమయానికి నిద్ర లేవడం వల్ల శారీరకంగా అలసట ఉండదు. అయితే అప్పటివరకు ఉన్న నిద్ర గడియారాన్ని ఈ విధంగా మార్చుకోవడం కష్టమే. కానీ మెల్లిమెల్లిగా ఆ ప్రయత్నం చేయడం వల్ల అలసట తగ్గిపోతుంది. ఉదాహరణకు ప్రతిరోజు ఒంటిగంటకు నిద్రపోయి.. ఉదయం 8 గంటలకు నిద్రలేచేవారు.. ఒంటిగంట నుంచి 12 గంటలకు.. మరొక రోజు 11 గంటలకు.. ఇలా ముందుకు జరుపుకొని ఉదయం త్వరగా లేచే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
చాలామంది రకరకాల పనులు చేస్తూ అలాగే నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా మొబైల్ చూస్తూ చూస్తూ నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల నాణ్యమైన నిద్ర పట్టే అవకాశం ఉండదు. పడుకొని ఆలకుంట ముందు మొబైల్ ku దూరంగా ఉండాలి. టిఫిన్ వంటి పదార్థాలను అరగంట ముందు మాత్రమే తీసుకోవాలి. పడుకునే ముందు ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. అవసరం అనుకుంటే నచ్చిన సంగీతాన్ని వింటూ మానసికంగా ప్రశాంతతను ఏర్పాటు చేసుకోవాలి.
ఇలా ప్రతిరోజూ నిద్ర గడియారాన్ని ప్రణాళిక ప్రకారంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నిద్రలేమి కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏకాగ్రత కోల్పోవడం లాంటివి జరుగుతాయి.