టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రేమ జంటల్లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట అతి ముఖ్యమైనది. పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తోన్నా.. మోస్ట్ లవ్‌బుల్ జంటగా మహేష్, నమ్రత ఇప్పటికి ఫేవరేట్ గా నిలిచిపోయారు. కాగా ఈ రోజు నమ్రత 49వ పుట్టిన పుట్టిన రోజు జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న తన ప్రేమను తెలుపుతూ.. మహేష్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోని షేర్ చేస్తూ తనదైన శైలిలో విషెస్ తెలిపాడు.
Also Read: హిట్ అయితే జాతకమే మారిపోతుంది !
మహేష్ బాబు ఈ రోజు నాకు మరీ మరీ స్పెషల్ డే అంటూ ట్వీట్ చేస్తూ.. “తాను ఎంతగానో ప్రేమించే ఆ వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ప్రతిరోజు నీతో గడపడం ప్రత్యేకమైనదే.. కానీ ఈ రోజు అది మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్” అంటూ మొత్తానికి మహేష్ తన భార్య పై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకున్నాడు. పైగా ఈ మెసేజ్ తో పాటు నమ్రతతో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా దిగిన ఫొటోని కూడా మహేష్ ఫ్యాన్స్ కోసం షేర్ చేశాడు.
Also Read: ‘తొంగి తొంగి చూడమాకు చందమామ” విడుదల!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. అలాగే సెలబ్రెటీలు, ఫ్యాన్స్ కూడా తమ సూపర్ స్టార్ సతీమణి నమ్రతకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిమిత్తం తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక పుట్టినరోజు వేడుకల అనంతరం నమ్రతా శిరోద్కర్ సహా గౌతమ్, సితార హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్