https://oktelugu.com/

Weight Loss Tips: అధిక బరువును ఇలా తగ్గించుకోవచ్చు

అధిక బరువును ఊబకాయం అని కూడా అంటారు. దీన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. కానీ సులభమైన చిట్కా ఉపయోగించుకుని అధిక బరువును నియంత్రించుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 18, 2023 / 04:38 PM IST

    Weight Loss Tips

    Follow us on

    Weight Loss Tips: ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య అందరిని బాధిస్తోంది. దీన్ని బెల్లి ఫ్యాట్ అంటున్నారు. మితిమీరిన ఆహార అలవాట్లతో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతోంది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా ఎవరు లెక్కచేయడం లేదు. ఫ్యాట్ పెరిగిపోయి నడుము చుట్టు కొలత పెరిగిపోతోంది. ఫలితంగా అధిక బరువు కష్టాలకు గురిచేస్తోంది. అనేక రోగాలకు దారి తీస్తోంది. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    అధిక బరువును ఊబకాయం అని కూడా అంటారు. దీన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. కానీ సులభమైన చిట్కా ఉపయోగించుకుని అధిక బరువును నియంత్రించుకోవచ్చు. ఒక కీర దోసకాయ, నిమ్మరసం, అలవెరా, అల్లం, కొత్తిమీరతో బ్రహ్మాండమైన జ్యూస్ తయారు చేసుకోవచ్చు. దీంతో అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కెవచ్చు. ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

    వీటిని కలుపుకుని మంచి జ్యూస్ తయారు చేసుకుని రోజు పడుకోబోయే ముందు తాగడం వల్ల ఓ మూడు రోజుల పాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర లేచిన తరువాత మినిట్స్ కార్డియో వర్కౌట్స్ చేస్తే లాభం కలుగుతుంది. మెలకువతో ఉన్నప్పటితో పోలిస్తే పడుకున్నప్పుడు మనం తిన్నవి తొందరగా జీర్ణం కావు. ఇలా తాగినప్పుడు అవి తొందరగా జీర్ణం అయ్యేందుకు దోహదపడతుంది.

    ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టుపేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. బెల్ ఫ్యాట్ తగ్గుతుంది. దీంతో నెల రోజుల్లో సన్నగా మారతారు. దీని వల్ల మనకు ముప్పు లేకుండా ఉంటుంది. అధిక బరువును తగ్గించుకుంటే మనకు ఎంతో లాభం ఉంటుంది. కొవ్వు తగ్గడం వల్ల గుండెపోటు సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన విధంగా తయారు కావచ్చు.