Migraine: ప్రస్తుత కాలంలో మైగ్రేన్ తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మైగ్రేన్ అంటే చాలా వరకు తలనొప్పే కదా అని భావిస్తారు. కానీ ఆ పెయిన్ భరించే వాళ్లకే తెలుస్తుంది. అయితే మైగ్రేన్ సమస్యతో బాధపడేవాళ్లు ఈ చిట్కాలను పాటించడంతో తలనొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మైగ్రేన్ తలనొప్పి బాధితుల్లో కొంతమందిని ఎక్కువగా కుంగదీస్తుంది. తలకు ఒక వైపున మాత్రమే తీవ్రమైన నొప్పి రావడంతో పాటు వికారంగా అనిపిస్తుంది. అదేవిధంగా కాంతి, ధ్వనిని తట్టుకోలేరు. అయితే మైగ్రేన్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండకపోయినప్పటికీ తలనొప్పి తీవ్రత మాత్రం ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉంటుంది.
మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. నీటితో పాటు జ్యూస్లు, సూప్ లు తాగాలి. శరీరం డీహైడ్రేట్ అవకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుదీనా నూనె, చమోమిలే నూనెతో నుదుటిపై మసాజ్ చేసుకోవచ్చు.
మైగ్రేన్ తలనొప్పి లక్షణాలను తగ్గించడానికి అల్లం కూడా సహాయపడుతుంది. అల్లంతో టీ లేదా వేడి నీళ్లు తాగవచ్చు. సాధారణ టీ, కాఫీలు తాగటం వలన మైగ్రేన్ సమస్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చమోమిలే ఆయిల్ మైగ్రేన్ లక్షణాలను నియంత్రిస్తుంది. ఈ ఆయిల్ తో నుదుటిపై మసాజ్ చేయడం వలన కానీ వేడినీళ్లలో వేసుకుని ఆవిరి పట్టినా ఉపశమనం పొందవచ్చు. మైగ్రేన్ నొప్పి ప్రారంభం అయితే తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అలాగే మైగ్రేన్ సమస్యనుు నియంత్రించడానికి క్రమం తప్పకుండా యోగా చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.