దాదాపు 14 రోజులు కాళ్లను కదపకుండా ఉంటే కాళ్ల బలం 10 సంవత్సరాలు తగ్గే అవకాశాలు ఉంటాయని సమాచారం. ప్రతిరోజూ సాధ్యమైనంత వరకు నడవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాలి కండరాలు బలహీనపడితే వ్యాయామం చేసినా కోలుకోవడానికి సమయం పడుతుంది. శరీరం మొత్తం బరువును పాదాలు మోస్తాయి. రోజుకు కనీసం 10 వేల అడుగులు నడవాలి. అలా నడవడం వల్ల బలమైన ఎముకలు, బలమైన కండరాలు ఏర్పడతాయి.
పాదాలు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బలమైన కాలి కండరాలు ఉన్న వ్యక్తుల్లో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ కాళ్ల వ్యాయామం చేయడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాళ్లకు క్రమం తప్పకుండా శ్రమ కలిగిస్తే వృద్ధాప్యం నుంచి కాపాడుకోవచ్చు. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేస్తే మంచిది.
వ్యాయామం చేయడం ద్వారా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. వ్యాయామం చేయకపోతే ఎముక పగుళ్లు, ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా శరీరానికి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరుతాయి.