Vizag Colony Tourism: ఓ వైపు దట్టమైన నల్లమల అడవి.. మరోవైపు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్.. మధ్యలో అద్భుతమైన జలదృశ్యం.. అందులో మన ‘వైజాగ్ కాలనీ’.. రహదారిని ఆనుకొని ఉండే అందమైన లోగిళ్లులు..చూడడానికి అదో చిన్న తీర పట్టణాన్ని తలపిస్తుంది ఈ వైజాగ్ కాలనీ. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ తీరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చూడడానికి చుట్టుపక్కల జనం తరలివస్తున్నారు. ఇక్కడి ప్రకృతి అందానికి పులకించిపోతారు.
వైజాగ్ కాలనీ.. హైదరాబాద్ -నాగార్జున సాగర్ మార్గంలో మల్లేపల్లి నుంచి 32 కి.మీల దూరంలో ఉందీ ప్రాంతం.. కొండకోనల మధ్యనున్న ఈ ప్రాంతం విహారానికి ప్రసిద్ధి చెందింది. ఆహ్లాదకర వాతావరణం.. బోటింగ్.. సరికొత్త పర్యాటక ఆకర్షణగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకే కాదు.. ‘చేపల రుచులకూ’ ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అందుకే సౌకర్యాలు లేకున్నా ఇక్కడకు పర్యాటకుల తాకిడీ మాత్రం పెరుగుతోంది.
నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ఆమ్రాబాద్ అభయారణ్యంలో భాగంగా ఈ ప్రాంతం ఉంది. ఈ మండలంలో సాగర్ బ్యాక్ వాటర్ కు ఆనుకొని ఉన్న పెద్ద మునిగెల్, చిన్న మునిగెల్, వైజాగ్ కాలనీ, బుగ్గతండా, కాశరాజు పల్లి, సుద్దబాయితండా మీదుగా దేవరచర్లకు మొత్తం 15 కి.మీల మేర వంపులు తిరుగుతూ సాగే రహదారి అద్భుతమైన అనుభూతినిస్తుంది.
పచ్చదనంతో కనువిందు చేసే కొండల నడుమ, గిరిజన తండాల మీదుగా ప్రయాణిస్తుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.. ఇక్కడి రహదారులపై ఆరబోసిన చేపలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అప్పుడే పట్టి మనకు చేపలు ఇస్తారు. కావాలంటే డబ్బులు తీసుకొని వండి కూడా ఇస్తారు.
Also Read: Hero Nikhil: తండ్రి కోరిక కోసం తమ్ముడ్ని హీరోని చేస్తున్నాడు !
నాగార్జున సాగర్ నిర్మాణం కోసం వచ్చిన కార్మికులు.. ఇక్కడ కాలనీలు కట్టుకొని ఉండిపోయారు. వీళ్లందరూ ఏపీలోని విశాఖ నుంచి రావడంతో వారి కాలనీకి ‘వైజాగ్ కాలనీ’ అని పేరు పెట్టుకున్నారు. కొద్దిమంది మహారాష్ట్ర, ఒడిషా నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీళ్లు ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కూర, రోటీలను డబ్బులు తీసుకొని వండిపెడుతారు. అప్పుడే పట్టి వండిన చేపల కూర ఇక్కడ ఫేమస్.
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో రేయింబవళ్లు చేపలవేటను ఇక్కడి గ్రామస్థులు చేపడుతారు. ఇటీవల పర్యాటకులు పెరగడంతో భోజన ఏర్పాట్లు, కిరాణా షాప్ ల ద్వారా ఉపాధి పొందుతున్న వారు చాలా మంది కనిపిస్తారు. ఇక్కడ చేపల పులుసు, చేపల ఫ్రై వంటకాలు టూరిస్టులకు పెడుతుంటారు.
బ్యాక్ వాటర్ కాబట్టి షూటింగ్ కు మంచి అనువైన అందమైన ప్రదేశాలున్నాయి. ఎండాకాలం.. వాటర్ తగ్గినప్పుడు నాగార్జున సాగర్ లోని ఐల్యాండ్ లు బయటపడుతాయి. అవి ప్రకృతి రమణీయతను పంచుతాయి. నీళ్లు సాగర్ లో ఫుల్లుగా ఉంటే ఈ ఐలాండ్ లు మునిగిపోతాయి… వసతి గృహాలు కట్టిస్తే ఇక్కడ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది.
ఇక వైజాగ్ కాలనీకి చుట్టుపక్కలా పర్యాటక ప్రదేశాలున్నాయి. దేవరచర్లలో ముని శివాలయం, రాక్షస గూళ్లు, ఆదిమానవుల గాజుబే గుహలు, అంబా భవానీ ఆలయం, కాసరాజు పల్లిలోని పుష్కరఘాట్లు, తిరుమలలా కనిపించే ఎత్తైన కొండలు ఫేమస్.
ఇక ఆమ్రాబాద్ అభయారణ్యంలోని పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఇక్కడ విరివిగా కనిపిస్తాయి. బ్యాక్ వాటర్ తో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రాంతం పర్యాటకులకు మంచి కిక్ ఇస్తుంది.
Also Read: Samantha Hot Treat: బాబోయ్ మళ్లీ హాట్ ట్రీట్.. ఈ ఫోటోల్లో సమంతను చూశారంటే !
సో వైజాగ్ కాలనీని ‘ఓకే తెలుగు’ ఫుడ్ ట్రావెల్ యూట్యూబ్ చానెల్ సందర్శించింది. అక్కడి అందాలు, అక్కడి విభిన్న రుచులను బయటి ప్రపంచానికి చూపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ కింది వీడియోలో మీరూ చూసి ఆస్వాదించండి.
Recommended Videos
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Vizag colony is a new tourism destination at nalgonda district in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com