Vitamin D: విటమిన్ డి ఎలా వస్తుంది? ఎండలో ఎంత సేపు ఉండాలి?

కేవలం సూర్యుని నుంచి వచ్చే ఎండను శరీరానికి తాకేలా చేస్తే సరిపోతుంది. ఇంతకీ ఏ సమయంలో కూర్చోవాలి. ఎంత సమయం కూర్చోవాలి? ఎప్పుడు కూర్చోవాలి? వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

Written By: Swathi, Updated On : March 12, 2024 4:36 pm

Vitamin D

Follow us on

Vitamin D: శరీరానికి చాలా విటమిన్లు అవసరం. ఇక విటమిన్ డి న్యూరోట్రాన్స్ మీటర్ లా పనిచేస్తుంది. మెదడు నుంచి శరీరంలోని అన్ని అవయవాలకు సందేశాలను పంపిస్తుంది. ఇది హర్మోన్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే విటమిన్లు లోపిస్తే ఆరోగ్యం దెబ్బతినడమే కాదు శరీరంలోని డోపమైన్ స్థాయి ప్రభావితం అవుతుంది. డిప్రెషన్ వంటి వ్యాధుల బారిన కూడా పడుతారు. అయితే విటమిన్ డి మాత్రం ఎలాంటి ఖర్చు లేకుండానే వస్తుంది. దీని కోసం ఎండలో నిల్చుంటే చాలు.

కేవలం సూర్యుని నుంచి వచ్చే ఎండను శరీరానికి తాకేలా చేస్తే సరిపోతుంది. ఇంతకీ ఏ సమయంలో కూర్చోవాలి. ఎంత సమయం కూర్చోవాలి? ఎప్పుడు కూర్చోవాలి? వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి ఆ విషయాలను మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఆర్టికల్ ను చదివేసేయండి. అయితే సూర్యుని ఎండ వల్ల విటమిన్ డి సప్లిమెంట్లను పొందవచ్చు. ఇక ఈ ఎండకోసం ప్రతిరోజు 10 నుంచి 30ని. సూర్యరశ్మిలో నిల్చోవాలి. ఇక ఎండలో ఎంత సేపు ఉండాలి అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది. పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది.

సూర్యకాంతిలోనే విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. అయితే ఇలా మీరు సూర్యరశ్మిలో ఉన్నప్పుడు మీ చర్మం రంగు మారే అవకాశం ఉంటుంది. ఈ కాంతే విటమిన్ డి కి మూలంగా ఉంటుంది. అయితే ఈ విటమిన్ డి పిల్లలు, శిశువులు పెద్దలు అందరికి కూడా ఒకేలా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం వేడి ఎక్కువ ఉంటుంది. అందుకే ఉదయమే ఎండలో నిల్చోవాలి. ఈ ఎండలో మాత్రమే విటమిన్ డి వస్తుంది.

ఇక ఈ విటమిన్ డి ఉదయం మాత్రమే వస్తుంది. అయితే ఎక్కువ సేపు కూడా ఎండలో నిల్చోకూడదు. దీని వల్ల చర్మానికి ఏవైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒత్తిడి, సన్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ క్యాన్సర్ లు కూడా వస్తుంటాయి. అందుకే ఎండలో ఉంటే సన్ స్కీన్ ను వాడడం మంచిది.