Low Budget Car: లో బడ్జెట్ లో కారు కొనానలుకుంటున్నారా? టాప్ 5 కార్లు ఇవే..

. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా తక్కువ ధరకు అందించాలని కొన్ని మోడళ్లను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు వాటిల్లో అత్యంత తక్కువ బడ్జెట్ కార్లు ఇవే అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిల్లో టాప్ 5 కార్లు ఏవో తెలుసుకుందాం..

Written By: Chai Muchhata, Updated On : March 12, 2024 4:37 pm

Prmium car Low Budjet

Follow us on

Low Budget Car: భారత్ లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే నేటి కాలంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా సొంత వెహికల్ ఉండాలనుకుంటున్నారు. ఈ తరుణంలో లోబడ్జెట్ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా తక్కువ ధరకు అందించాలని కొన్ని మోడళ్లను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు వాటిల్లో అత్యంత తక్కువ బడ్జెట్ కార్లు ఇవే అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిల్లో టాప్ 5 కార్లు ఏవో తెలుసుకుందాం..

దేశంలో అత్యధికంగా వినియోగించే కార్లలో మారుతి కంపెనీకి ఎక్కువగా ఉంటాయి. ఈ కంపెనీ దాదాపు లో బడ్జెట్ లోనే కారును మార్కెట్లోకి తీసుకొస్తుందని చాలా మంది అభిప్రాయం. అనుకున్నట్లుగానే రెండేళ్ల కింద వ్యాగన్ ఆర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పికీ ఈ మోడ్ హవా సాగుతోనే ఉంది. వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ పెట్రోల్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. దీనిని రూ.5.55 లక్షల ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు.

మారుతి తరువాత టాటా కంపెనీ తక్కువ ధరకు కార్లు అందించే కంపెనీల్లో రెండో స్థానంలో ఉంది. టాటా నుంచి రిలీజ్ అయిన పంచ్ రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక వేరియంట్లను కలిగి ఉంది. ఇది సేప్టీలో భాగంగా గ్లోబల్ టెస్ట్ లో అత్యధిక రేటింగ్ పొందింది. ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ కూడా ఉంది.

టాటా కంపెనీకి చెందిన టియాగో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. దీనిని కూడా రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ10 తక్కవ ధరకు అందించే కార్లలో 4వ స్థానంలో నిలిచింది. ఇందులో 1.2 పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీని కూడా అమర్చారు. దీనిని రూ.5.84 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇదే కపెంనీకి చెందిన ఎక్స్ టర్ కూడా రూ.6.12 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ మోడల్స్ లో అందుబాటులో ఉంది.