Business Ideas: కష్టాలకు కుంగిపోకూడదు. సుఖాలకు పొంగిపోకూడదు అంటారు. జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని నిలదొక్కుకోవడమే అలవాటుగా మార్చుకుంటే ఇక తిరుగే ఉండదు. కష్టం వచ్చిందని కంగారు పడి ఏదో జరిగిందంటూ బాధ పడటం కాదు. అనుకున్నది సాధించేవరకు విశ్రమించకూడదు. అన్నింటిని అదిగమించి విజేతలుగా నిలిచిన వారెందరో ఉన్నారు. వారు కూడా ఊరకే ఏదో రాత్రికి రాత్రే గొప్ప వారు కాలేదు. అకుంఠిత దీక్ష, పట్టుదల వారి సొంతం. పట్టుదలే వారి పంతం. అనుకున్నది సాధించడమే లక్ష్యం. అందకు అన్ని మార్గాలు అన్వేషించి ఆ దారిలోనే నడిచి చివరకు విజయతీరాలకు చేరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

పుట్టెడు కష్టాలను దిగమింగి పుస్తె మట్టెలు తాకట్టు పెట్టి చేసిన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. దీంతో ఆమె విజయతీరాలు అధిరోహించింది. విశాఖపట్నంకు చెందిన విజయలక్ష్మి కొన్నాళ్ల క్రితం భర్త అనారోగ్యంతో ఎన్నో కష్టాలు పడింది. ఇక జీవితంలో ఎదిగేందుకు ఏ మార్గం లేదని అనుకుంటున్న సమయంలో ఆమెకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఫలితంగా ఆమె రుణం కోసం బ్యాంకుల చుట్టు తిరిగింది. కానీ ఏ బ్యాంకు కూడా ఆమెను విశ్వసించలేదు. రుణం మంజూరు చేయలేదు.
Also Read: Anand Mahindra: గుజరాత్‌లో ప్రధాని పర్యటనపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..
అనుకోకుండా కెనరా బ్యాంకు రూ.16 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. బిస్కెట్ టీ కప్పులు తయారు చేసే పరిశ్రమ ప్రారంభించింది. దీంతో ఆమె వ్యాపారం మొదలుపెట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రోజురోజుకు నిలదొక్కుకుంది. ఆర్డర్లు పెరిగాయి. మొదట అటువంటి వ్యాపారం ఉంటుందా అని హేళన చేసిన వారే తరువాత ముక్కున వేలేసుకున్నారు. పెట్టుబడి కోసం తాళిబొట్టు కూడా తాకట్టు పెట్టిన ఆమె ప్రస్తుతం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకుపోవడం తెలిసిందే.

ఇప్పుడు రోజుకు ఆరు వేల కప్పుల చొప్పున నెలకు లక్షన్నరకు పైగానే సరఫరా చేస్తూ తనకంటూ ప్రత్యేకత సాధించుకుంది. దీంతో మరికొంత మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రశంసలందుకుంటోంది. ఏ పని చేసినా ఇష్టంగా చేస్తే కష్టమే ఉండదని చెబుతోంది. వ్యాపార రంగంలో రాణిస్తూ లాభాల బాటలో ప్రయాణిస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. అనుకున్నది సాధించి అందరి మన్ననలు పొందుతోంది.
Also Read: Bheemla Nayak OTT Release: భీమ్లానాయక్ ఓటీటీలో వచ్చే డేట్ ఇదే.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్..