
భారత్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతిరోజూ అంచనాలను మించి భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. వైరస్ ముక్కు, గొంతులో ఉన్నవారిలో వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read : కరోనా రోగులకు శుభవార్త… ఆ మెడిసిన్ హోం డెలివరీ…?
కరోనా వైరస్ బారిన పడితే శరీరంలో కరోనా వైరస్ లోడ్ వల్ల మనం రుచి, వాసనను కోల్పోతామనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వైరస్ కు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది శరీరంలో వైరస్ లోడ్ ఎక్కువ స్థాయిలో ఉన్నా రుచి, వాసనలను తిరిగి పొందుతున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. 39 మంది రోగుల డేటాను పూర్తిస్థాయిలో పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
వైరస్ లోడ్ ఉన్నా చాలామంది పది రోజుల్లో రుచి, వాసన లాంటి లక్షణాలను తిరిగి పొందుతున్నారని తెలిపారు. కరోనా బారిన పడిన నాలుగు నుంచి ఆరు వారాల తరువాత పూర్తిస్థాయిలో 72 శాతం మంది వాసన సామర్థ్యాన్ని, 83 శాతం మంది రుచిని పొండగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. వైరస్ లోడ్, లక్షణాల తీవ్రత మధ్య గణనీయమైన సంబంధం లేదని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. లారింగో స్కోప్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఇతర వివరాలు ప్రచురితమయ్యాయి.
Also Read : వర్షం బంపర్ ఆఫర్.. ఒక్క దెబ్బతో కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే?