https://oktelugu.com/

Vastu Tips : వాస్తు టిప్స్ : ఇంట్లో అనుకూల పరిస్థితులు రావాలంటే ఇలా చేయండి

ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని ఉండకపోతే ఇబ్బందులు రావడం సహజం. ఈ నేపథ్యంలో మంచం మీద కూర్చుని తినడం, బాత్ రూం శుభ్రంగా లేకపోవడం వంటి తప్పులు చేయడం వల్ల కూడా మనకు నష్టాలే వస్తాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటిని దూరం చేసుకోవడమే మంచిది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 20, 2023 / 07:43 PM IST
    Follow us on

    Vastu Tips :  మనం వాస్తును నమ్ముతుంటాం. అన్ని పక్కా వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే సర్దుకుంటాం. ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని ఉండకపోతే ఇబ్బందులు రావడం సహజం. ఈ నేపథ్యంలో మంచం మీద కూర్చుని తినడం, బాత్ రూం శుభ్రంగా లేకపోవడం వంటి తప్పులు చేయడం వల్ల కూడా మనకు నష్టాలే వస్తాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటిని దూరం చేసుకోవడమే మంచిది.

    మంచం మీద కూర్చుని తినడం

    మనలో చాలా మంది మంచం మీద కూర్చుని తింటుంటారు. ఇది సరైంది కాదు. ఇలా చేయడం వల్ల ఇంటిలో అనారోగ్యాలు కలుగుతాయి. అశాంతిని కలిగిస్తుంది. ఇంట్లో అప్పుల భారం పెరుగుతుంది. మంచం మీద కూర్చుని తింటే వ్యాధుల ముప్పు ఉంటుంది. ఈ అలవాటు మానుకోవడం మంచిది. దీని వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. అందుకే ఇది మంచి పద్ధతి కాదని తెలుసుకోవాలి.

    వంట గది

    వంట గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పూట తిన్న పాత్రలు అలాగే ఉంచుకోకూడదు. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవడమే మంచిది. వంట గది చిందరవందరగా ఉంటే కూడా నష్టమే. జీవితంలో ఉద్రిక్తతను కలిగిస్తుంది. అపరిశుభ్రమైన పాత్రలు ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. ఎప్పుడు శుభ్రంగా ఉంటేనే మనకు మంచి ఫలితాలు రావడం సహజం.

    పడుకునే ముందు..

    రాత్రి పడుకునే ముందు వంట గదిలో ఒక బకెట్ లో నిండా నీరు ఉంచండి. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జీవితంలో ఎదిగేందుకు మార్గం ఏర్పడుతుంది. సంతృప్తికరమైన జీవితం సొంతం అవుతుంది. బాత్ రూంలో కూడా బకెట్ నిండుగా నీరు ఉంచుకుంటే లక్ష్మీదేవి సంతోష పడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు వస్తుందని తెలుసుకోవాలి.

    ఈశాన్య మూలలో..

    మన ఇంటికి ఈశాన్యం మూల అత్యంత పవిత్రమైనది. ఈ దిక్కు ఓ డబ్బాలో లేదా చిన్న పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో నివసించే వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. పనులు కూడా సాఫీగా సాగుతాయి. తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ మూలలో ప్రార్థనా స్థలం ఉంచుకోవడం చాలా మంచిది.

    ప్రధాన ద్వారం వద్ద..

    ఇంటి ముఖద్వారం వద్ద చెత్త డబ్బా ఏర్పాటు చేయకూడదు. ఇలా చేయడం వల్ల పొరుగు వారితో సంబంధాలు దెబ్బ తింటాయి. ఇరుగుపొరుగు వారు శత్రువులుగా మారతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రధాన ద్వారం వద్ద చెత్త డబ్బాను ఉంచకుండా దూరం పెట్టాలి. ఇంటి బయట కూడా ఉంచకూడదు. సరైన ప్రాంతంలోనే ఉంచితే మంచిది.