https://oktelugu.com/

Health Tips : వంటింట్లో స్పాంజ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. సంచలన విషయాలు తేల్చి చెప్పిన పరిశోధనలు

రోజూ స్పాంజ్‌తో వంట పాత్రలు క్లీన్ చేస్తారు. కానీ వారినికి ఒకసారి కూడా స్పాంజ్‌ను క్లిన్ చేయరు. దీనివల్ల అందులోనే బ్యాక్టీరియా అంతా ఉండిపోతుంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్‌లో ఉండే బ్యాక్టీరియాల కంటే స్పాంజ్‌లోనే ఎక్కువ బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయని తాజాగా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 21, 2024 / 12:05 AM IST

    Sponge Use in Kitchen

    Follow us on

    Health Tips :  అందరి ఇంట్లో తప్పకుండా వంట చేస్తారు. కనీసం వంట చేయకుపోయిన తిన్న తర్వాత ప్లేట్లు శుభ్రం చేయడానికి స్పాంజ్ వాడుతుంటాం. ప్రతీ ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. పూర్వకాలంలో స్పాంజ్‌లకు బదులు కొబ్బరి పీచు, గడ్డి వంటివి వాడేవారు. కానీ ఈ రోజుల్లో అంతా ఫ్యాషన్ అయిపోయి.. వెరైటీగా ఉండే స్పాంజ్‌లను వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ స్పాంజ్‌తో వంట పాత్రలు క్లీన్ చేస్తారు. కానీ వారినికి ఒకసారి కూడా స్పాంజ్‌ను క్లిన్ చేయరు. దీనివల్ల అందులోనే బ్యాక్టీరియా అంతా ఉండిపోతుంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్‌లో ఉండే బ్యాక్టీరియాల కంటే స్పాంజ్‌లోనే ఎక్కువ బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయని తాజాగా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. స్పాంజ్‌లు ఎప్పుడు కూడా తేమతో ఉండటం వల్ల వాటిలో మురికి ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఒక స్పాంజ్‌లో దాదాపుగా 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందట. అలాగే 5 శాతం వరకు సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

    స్పాంజ్‌లు వాడటం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తుననారు. మెనింజైటిస్, న్యుమోనియా, డయేరియా, బ్లడ్ పాయిజన్, క్యాన్సర్, గుండె సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. చిన్న వయస్సులో నుంచే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్పాంజ్‌లో ఉన్న బ్యాక్టీరియా వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాం ఉంది. ఇవి ఎల్లప్పుడూ తేమతో ఉంటాయి. దీనినే హిమోలిటిక్ యూరేమిక్ సిండ్రోమ్ అని అంటారు. దీనివల్ల మూత్ర పిండాలు, కిడ్నీ సమస్యలు, ఫుడ్ పాయిజన్, చర్మ వ్యాధులు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరించారు.

    కొందరు ఈ స్పాంజ్‌లను అసలు క్లీన్ చేయరు. ఎక్కువ రోజులు ఒకే స్క్రబ్‌నను వాడుతుంటారు. ముఖ్యంగా దీన్ని కనీసం ఎండలో కూడా పెట్టరు. దీనివల్ల తేమ నిండిపోయి.. బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే కనీసం రెండు నెలలకు అయిన కూడా స్క్రబ్ మార్చాలని నిపుణులు అంటున్నారు. అలాగే వంటపాత్రలు క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్‌ను వేడి నీటిలో క్లిన్ చేసి ఎండలో ఉంచాలి. అప్పుడే అందులోని బ్యాక్టీరియా అంతా కూడా కొంత వరకు తగ్గుతుంది. అలాగే మాంసాహారానికి వేరే స్పాంజ్ వాడటం మంచిది. వెజ్‌తో పోలిస్తే నాన్‌వెజ్‌ వల్ల ఎక్కువగా బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రెండు నెలలకు ఒకసారి స్క్రబ్‌ను మారుస్తూ.. నాన్‌వెజ్‌కి వేరేగా వాడాలని నిపుణులు సూచించారు. ఈ జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని, చివరకు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.