https://oktelugu.com/

Free Sim Card : ఫ్రీగా ఇస్తున్నారని సిమ్ తీసుకున్నారో.. అంతే సంగతులు ఇక

అసలు ఇలా సిమ్ తీసుకుంటే ఎందుకు స్కా్మ్‌లో ఇరుక్కుంటారు, ఆధార్ కార్డు ఇచ్చి ఫ్రూఫ్‌తోనే కదా సిమ్ తీసుకుంటున్నాం. ఎందుకు సమస్య వస్తుందని అనుకుంటున్నారా.. అయితే మీకోసమే. మీరు కూడా ఇలానే రోడ్డు మీద సిమ్ తీసుకుంటుంటే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Written By:
  • Bhaskar
  • , Updated On : December 20, 2024 / 11:19 PM IST

    Free Sim Card

    Follow us on

    Free Sim Card :  ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక మొబైల్ వాడుతున్నారు. మొబైల్ వాడాలంటే తప్పకుండా సిమ్ ఉండాలి. కొందరికి ఒక సిమ్ ఉంటే మరికొందరికి అంతకంటే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో డేటా, కాల్ ఛార్జీలు ఎక్కువగా అవుతున్నాయని కొందరు ఫ్రీగా వచ్చే సిమ్‌లు తీసుకుంటున్నారు. షాప్‌లలో కాకుండా రోడ్డు పక్కన ఫ్రీగా దొరికితే తీసుకుంటారు. ఒక నెల రీఛార్జ్ ఫ్రీ, సిమ్ కూడా ఉచితం అంటే ఎగేసి మరి రెండు నుంచి మూడు సిమ్‌లు తీసుకుంటున్నారు. ఇలా సిమ్‌లు తీసుకోవడం వల్ల మీకు ఫ్రీగా లభించిందని హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ భవిష్యత్తులో మీరు సమస్యల్లో ఇరుక్కుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఇలా సిమ్ తీసుకుంటే ఎందుకు స్కా్మ్‌లో ఇరుక్కుంటారు, ఆధార్ కార్డు ఇచ్చి ఫ్రూఫ్‌తోనే కదా సిమ్ తీసుకుంటున్నాం. ఎందుకు సమస్య వస్తుందని అనుకుంటున్నారా.. అయితే మీకోసమే. మీరు కూడా ఇలానే రోడ్డు మీద సిమ్ తీసుకుంటుంటే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

    సాధారణంగా ఆధార్ కార్డు, ఫింగర్ ప్రింట్ ఉంటే సిమ్ ఇస్తారు. మీరు స్టోర్‌లో తీసుకున్నా లేదా రోడ్డు మీద తీసుకున్న కూడా ఇలానే ప్రాసెస్ ఉంటుంది. అయితే మీరు ఆధార్ కార్డు జిరాక్స్, ఫింగర్ ప్రింట్ వేసి సిమ్ తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత వారు వాటితో ఇంకా కొన్ని సిమ్‌లను తీసుకుంటారు. లీగల్‌గా కాకుండా ఇల్లీగల్‌గా మీ పేరు మీద సిమ్‌లు తీసుకుంటారు. ఈ సిమ్‌లు ఏం చేస్తారని అనుకుంటున్నారా.. వీటిని సైబర్ నేరగాళ్లు లేదా ఇతరులకు డేటాను అమ్మేస్తుంటారు. దీంతో మీకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలా ఎక్కడపడితే అక్కడ రోడ్డు మీద సిమ్‌లు తీసుకోవద్దు. ఆ నంబర్లతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడటం, ఫేక్ కాల్స్, కిడ్నాప్ వంటివి చేస్తే ఉపయోగిస్తారు. అప్పుడు పోలీసులు ఆ నంబర్‌ను మొదటిగా ట్రాస్ చేస్తారు. అప్పుడు మీ వివరాలు అన్ని కూడా వస్తాయి. దీంతో మీరే దొంగ అని పోలీసులు మిమ్మల్నే పట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా తెలసో తెలియక ఇలాంటి తప్పులు చేయవద్దు.

    మీకు తెలిసి మీ పేరు మీద కేవలం ఒక సిమ్ మాత్రమే ఉంటుంది. కానీ మీకు తెలియకుండా మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలియాలంటే సంచారీ సాతీ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులోకి వెళ్లి మీరు ప్రస్తుత వాడుతున్న నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఆ పూర్తి వివరాలు కూడా వచ్చేస్తాయి. అందులో ఉన్న కొన్ని సిమ్‌లు మీరు పూర్తిగా వాడటం లేదు అనుకుంటే.. ఆ వెబ్‌సైట్‌లోనే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ నంబర్ కింద డీయాక్టివేట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి రిపోర్ట్ కొడితే ఆ సిమ్ డీయాక్టివేట్ అయిపోతుంది. దీంతో మీకు ఎలాంటి సమస్య కూడా రాదు. ప్రస్తుతం రోజుల్లో ఇలాంటి స్కామ్‌లు పెరిగిపోతున్నాయి. ఏదో విధంగా మనుషులను మోసం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.