Sanitary pads : శానిటరీ ప్యాడ్స్‌ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే?

శానిటరీ ప్యాడ్స్ తయారీలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇందులో డయాక్సిన్ రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. వీటివల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శానిటరీ ప్యాడ్స్ తయారీలో వాడే పత్తిలో పురుగుల మందులు ఉంటాయి.

Written By: NARESH, Updated On : August 21, 2024 10:07 am

Using Sanitary pads

Follow us on

Sanitary pads : మహిళలను నెలసరి అనేది తప్పనిసరి. ఈ సమయంలో చాలామంది అసలు బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. ఎందుకంటే రుతుతిమ్మిరి, నడుం నొప్పితో బాధపడుతుంటారు. ఎక్కువశాతం మంది ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇంతకు ముందు రోజుల్లో నెలసరికి కాటన్ క్లాత్‌లను వాడేవారు. కానీ ప్రస్తుతం చాలామంది శానిటరీ ప్యాడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే వీటిని వాడటం అంత మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. శానిటరీ ప్యాడ్స్‌లో ఉండే రసాయనాల వల్ల మహిళల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే రుతుక్రమం సమయంలో శానిటరీ ప్యాడ్స్ వాడటం మంచిదా? లేకపోతే మెనుస్ట్రువల్ కప్ వాడటం మంచిదో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

శానిటరీ ప్యాడ్స్ తయారీలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇందులో డయాక్సిన్ రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. వీటివల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శానిటరీ ప్యాడ్స్ తయారీలో వాడే పత్తిలో పురుగుల మందులు ఉంటాయి. రైతులు పత్తిని సాగు చేసే సమయంలో వీటిపై పిచికారీ చేస్తుంటారు. వీటివల్ల మహిళలకు అండాశయంలో క్యాన్సర్, సంతానలేమి సమస్యలు, హార్మోన్లు పనిచేయకపోవడం, దద్దుర్లు, యోని సమస్యలు, అలెర్జీ, ఎండోమెట్రియంకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శానిటరీ ప్యాడ్స్‌లో బ్లీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో డయాక్సిన్ అనే ప్రమాదకర రసాయనం ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

శానిటరీ ప్యాడ్స్‌ను వాడేటప్పుడు చాలామంది గంటల పాటు మార్చకుండా ఉంటారు. ప్రతి 5 నుంచి 6 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మారుస్తుండాలి. రోజులో దాదాపు 4సార్లు ప్యాడ్స్ మార్చాలి. లేకపోతే యోని ప్రదేశంలో అలెర్జీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సువాసనలు ఉండే శానిటరీ ప్యాడ్స్ కూడా వాడకండి. ఎందుకంటే వీటికి సువాసనలు రావడానికి రకరకాల రసాయనాలు వాడుతారు. వీటివల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మహిళలు ఇర్‌రెగ్యూలర్ పీరియడ్స్ అవుతారు. శానిటరీ ప్యాడ్స్ నాణ్యతగా ఉండాలని ఇందులో ధాలేట్స్, వీఓసీలు వంటి విషపూరిత రసాయనాలు వాడుతుంటారు. వీటివల్ల వంధత్వం కూడా వచ్చే ప్రమాదముంది. అలాగే శానిటరీ ప్యాడ్స్‌ను ఎక్కువగా వాడటం వల్ల ఆస్తమా, ఏకాగ్రత కోల్పోవడం, హైపర్యాక్టివిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని వాడకం తగ్గిస్తే బెటర్ అని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రతి మహిళ తన జీవిత కాలంలో దాదాపు 40 వేల ప్యాడ్‌లను ఉపయోగిస్తారట. వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ కంటే మెనుస్ట్రువల్ కప్ లేదా క్లాత్‌తో చేసిన శానిటరీ ప్యాడ్స్ వాడటం మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. ఇవి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి.