https://oktelugu.com/

Sreeleela: విదేశాల్లో ప్రియుడితో చక్కర్లు కొడుతున్న శ్రీలీల, సంచలన ఫోటోలు వెలుగులోకి

హీరోయిన్ శ్రీలీల పారిస్ నగరంలో ప్రియుడితో చక్కర్లు కొడుతుంది. ప్రియుడితో శ్రీలీల ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. శ్రీలీల మనసు దోచుకున్న ఆ లక్కీ ఫెలో ఎవరో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : October 19, 2024 / 10:08 AM IST

    Sreeleela(1)

    Follow us on

    Sreeleela: టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. ఏక కాలంలో ఆమె అరడజనుకు పైగా చిత్రాలకు సైన్ చేసింది. పెళ్లి సందD మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీలీల, ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వకున్నా.. శ్రీలీల గ్లామర్, ఎనర్జీ, డాన్సులు కట్టిపడేశాయి. దాంతో దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. రవితేజతో చేసిన ధమాకా సూపర్ హిట్ కావడంతో శ్రీలీల లక్ తిరిగింది.

    అయితే ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ, పరాజయం పొందాయి. బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో కీలక రోల్ చేసింది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో నాలుగు చిత్రాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సాగండి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలో మరలా పట్టాలెక్కనుంది.

    నితిన్ కి జంటగా మరోసారి నటిస్తుంది. రాబిన్ హుడ్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. వీటితో పాటు రవితేజ 75వ చిత్రం. విజయ్ దేవరకొండ 12వ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. పట్టుమని పాతికేళ్ళు కూడా నిండని శ్రీలీల ప్రేమలో పడినట్లు సమాచారం అందుతుంది. అందుకు ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు కారణం అయ్యాయి. రొమాంటిక్ నగరంగా చెప్పుకునే పారిస్ లో ఎంజాయ్ చేస్తుంది శ్రీలీల. తన పారిస్ ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

    అయితే ఓ వ్యక్తితో శ్రీలీల పారిస్ వెళ్ళింది. సదరు వ్యక్తి ఫోటోను ఆమె అస్పష్టంగా ప్రజెంట్ చేసింది. శ్రీలీలతో ఉన్న వ్యక్తి ఆమె లవర్ కావచ్చనే చర్చ మొదలైంది. పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ గా మారింది. నిజంగా శ్రీలీల ప్రేమలో పడిందా? లేదా? అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. కొన్నాళ్ళు వేచి చూస్తే కానీ విషయం బయటకు రాదు.

    శ్రీలీల మరోవైపు మెడిసిన్ పూర్తి చేస్తుంది. ఆమె ఎంబిబిఎస్ స్టూడెంట్. శ్రీలీల తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్. బెంగుళూరులో ప్రముఖ డాక్టర్. అందుకే కూతురిని కూడా డాక్టర్ చదివిస్తుంది. చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ లో శిక్షణ ఇప్పించింది. అది శ్రీలీల కెరీర్ కి ప్లస్ అయ్యింది.