https://oktelugu.com/

Quinoa rice : క్వినోవా రైస్ రోజూ తింటే.. ఎన్నో ప్రయోజనాలు

వీటిని తిన్న ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఓట్స్ కంటే క్వినోవానే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే మితంగా మాత్రమే తీసుకోవాలి. దీనిని రోజూ తింటే చర్మం గ్లోగా తయారవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 25, 2024 / 03:01 AM IST

    Eating Quinoa rice daily has many benefits

    Follow us on

    Quinoa rice : ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఎన్నో రకాల పోషకాల ఉండే ఆహారాన్ని తింటుంటారు. ఈరోజుల్లో చాలామంది బయట ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. అందులో పోషకాలు లేకపోయిన తినడానికి టేస్టీగా ఉంది. కడుపు నిండింది కదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ తిని ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అసలు తినే ఫుడ్‌లో ఫైబర్ ఉందా లేదా కూడా చూసుకోవడం లేదు. తీరా అనారోగ్య సమస్యలు వస్తే కొన్ని రోజులు ఏదో జొన్నలు, కొర్రలు వంటివి తింటున్నారు. తగ్గిపోయిన తర్వాత ఇక వాటి సంగతే మర్చిపోతున్నారు. అయితే ఈ మధ్య చాలామంది క్వినోవా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.

    మిగతా ధాన్యాలతో పోలిస్తే క్వినోవాలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. అలాగే మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పేగులో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇట్టే తగ్గిస్తాయి. వీటిని కొంచెం తింటే చాలు కడుపు ఫుల్‌గా అనిపిస్తుంది. ఆకలి అంత తొందరగా వేయదు. దీంతో బరువు తగ్గుతారు. అలాగే ఊబకాయం కూడా రాదు. ఇది గ్లూటెన్ ఫీ. దీనిని తినడం వల్ల మధుమేహ సమస్యలు తగ్గుతాయి. అలాగే టైప్ 2 డయాబెటిస్ కూడా రాదు. గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు, మైగ్రేషన్‌లు వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అయితే రోజుకి సాధారణంగా ఒకటి నుంచి రెండు కప్పుల క్వినోవా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు.

    ఒక కప్పు క్వినోవా వల్ల 222 క్యాలరీలు లభిస్తాయి. అలాగే 39 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు, 8 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల పీచు పదార్థాలు, 3.55 గ్రాముల కొవ్వులు ఉంటాయి. అలాగే ఫోలేట్, విటమిన్స్, కాపర్, జింక్ ఐరన్ వంటివి కూడా లభిస్తాయి. వైట్ రైస్‌కి బదులు క్వినోవా తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు సకాలంలో అందుతాయి. అలసట, నిద్రలేమి, తలనొప్ప, రక్తహీనత, కండరాల తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. క్వినోవాను ఏ విధంగానైనా కూడా తినవచ్చు. కొందరు రైస్‌కి బదులు దీనిని మూడు పూటలు తింటారు. కానీ మరికొందరు వీటిని సలాడ్స్, ఉప్మా, పకోడి, కిచిడిలా చేసి కూడా తినవచ్చు. వీటితో తయారు చేసిన బిస్కెట్స్ కూడా ఉంటాయి. వీటిని తిన్న ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఓట్స్ కంటే క్వినోవానే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే మితంగా మాత్రమే తీసుకోవాలి. దీనిని రోజూ తింటే చర్మం గ్లోగా తయారవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.