Twitching Eye: కొంత మందికి కళ్లు విపరీతంగా కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో మగవారికి కుడికన్ను అదిలితే, ఆడవారికి ఎడమ కన్ను కదిలితే శుభం అంటారు. అయితే ఇలా చాలా సార్లు కదులుతున్నా శుభ, ఆశుభాల గురించే మాట్లాడుకుంటారు. కానీ ఇలా పదే పదే కళ్లు కదులుతున్నాయంటే దాని వెనుక వేరే కారణం ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా కళ్ల కండరాల్లో సమస్యలు ఉండడం వల్ల ఇలా పదే పదే కళ్లు అదులుతాయని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు. ఇంకా ఎటువంటి సమస్యలు ఎదురవుతాయంటే?
శరీరంలో కళ్లు ప్రధాన అవయవాలు. మిగతా వాటి కంటే కళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న సమస్య ఏర్పడినా వెంటనే అప్రమత్తవ్వాలి. లేకుంటే కళ్లు పోయే పరిస్థితిర రావచ్చు. కళ్లు అదలడం చాలా మందిలో ఉన్న సమస్యే. కానీ దీనిని చాలా చిన్న సమస్యగా పరిగణిస్తారు. ఒక్కోసారి కుడి లేదా ఎడమ కన్ను అదులుతూ ఉంటాయి. ఇలా ఒక్కోసారి కదిలి ఆ తరువాత సమస్య లేకుంటే ఏం కాదు. కానీ పదే పదే ఇలా కళ్లు కదలడం వల్ల సమస్యలు ఉన్నట్లే.
శరీరానికి పోషకాలతో పాటు కొన్ని మినరల్స్ కూడా అవసరం ఉంటాయి. వీటిలో మెగ్నిషీయం ప్రధానమైనది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం ప్రధానమైనది. మెగ్నిషియంతో ఎముకలు బలంగా మారుతాయి. అతేకాకుండా మెగ్నీషియం కండరాల విశ్రాంతి తీసుకోడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఖనిజం లోపం ఏర్పడినప్పుడు కండరాలు వీక్ అవుతాయి. దీంతో తలనొప్పి కూడా వస్తుంది. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కండరాలు బలహీనంగా మారినప్పుడు కళ్లు కూడా విపరీతంగా అదులుతూ ఉంటాయి. అయితే దీనిని నిర్లక్ష్యంగా తీసుకోకుండా సరైన చికిత్స తీసుకోవాలి. ఇక కాళ్లు తిమ్మిరి, మలబద్దకం లాంటి సమస్యలకు కూడా మెగ్నీషియం లోపమే కారణం. అందువల్ల ఈ సమస్య ఉన్నవారు లైట్ గా తీసుకోకుండా వెంటనే అప్రమత్తమై చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.