Turmeric: కూరల్లో తప్పనిసరిగా పసుపు వాడుతారు. ఆరోగ్యానికి పసుపు చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అందాన్ని పెంచడంలో కూడా సాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన కూడా ఏ పదార్థాన్ని అయిన కాస్త లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పసుపు యాంటీ బయోటిక్ ఆరోగ్యానికి మంచిది. అయితే మనలో చాలా మందికి పచ్చి పసుపు గురించి పెద్దగా తెలియదు. ఇందులోని పసుపు పొడి కంటే ఈ పచ్చి పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపులో సహజమైన మూలికలు, ఔషధాలు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మరి ఈ పచ్చి పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ పచ్చి పసుపును ఏ విధంగా తిన్నా కూడా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పచ్చి పసుపును ముఖ్యంగా పాలతో తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు అన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఈ పచ్చి పసుపును తేనె, టీతో కూడా కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతుంది. అలాగే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. వీటితో పాటు కాలేయం ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. పచ్చి పసుపును ఏదో విధంగా తీసుకోవడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్లు నయం కావడంతో పాటు గుండె, మధుమేహం, క్యాన్సర్, మెదడు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి పసుపును ఎక్కువగా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యానికి అయిన కూడా ఈ పసుపును తప్పనిసరిగా వాడుతారు. దీన్ని వాడటం వల్ల ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని భావిస్తారు. కొందరు ఈ పచ్చి పసుపును ఇంట్లోనే పండించుకుంటారు. పెరట్లో ఉండే కుండీల్లో ఈ పసుపును పెంచడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించవచ్చని భావిస్తారు. ఈ పచ్చి పసుపు మార్కెట్లో దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువగా ఎండిన పసుపును మాత్రమే వాడుతుంటారు. మీరు ఇంట్లోనే దీన్ని పండించుకోవడం బెటర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.